South West Monsoon: నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందుగా ఊహించినట్టే నైరుతి రుతుపవనాలు దేశంలో ముందస్తుగా ప్రవేశించాయి. మే 29వ తేదీన కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. కర్ణాటకలో కార్వార్, చిక్‌మగళూరు, బెంగళూరు, ధర్మపురి మీదుగా నైరుతి రుతుపవనాలు ఆవహించాయి.


వచ్చే రెండ్రోజుల్లో కొంకన్, గోవాలోని కొన్ని భాగాలకు..తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు రుతు పవనాలు వ్యాపించనున్నాయి. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇంకొన్ని ప్రాంతాల్లో, ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది.


ఇవాళ నైరుతి రుతుపవనాలు వాయవ్య దిశ నుంచి తెలంగాణవైపుకు వీస్తున్నాయి. ఫలితంగా రానున్న రెండ్రోజులపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఎల్లుండ మాత్రం రాష్ట్రంలో పొడి వాతావరణముంటుంది. రాష్ట్రంలో ఇవాళ ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు, మోస్తరు వర్షం పడనుందని వాతావరణ శాఖ సూచించింది. 


Also read: Telangana Courts: తెలంగాణ చరిత్రలో మరో నవ శకం..కొలువు దీరనున్న జిల్లా కోర్టులు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook