Heavy  Rains: నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలు మినిహా మిగితా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నిజామాబాద్, కామాపెడ్డి, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాత్రి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రవారం ఉదయం 8-30 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా కుమురం భీమ్ జిల్లా బిజ్జూరులో 97 మిలిమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ లో 74, కోమురం భీమ్ జిల్లా జైనూరులో 62, నిజామాబాద్ జిల్లా మాచర్లలో 61, కామారెడ్డి జిల్లా  సర్వాపూర్ లో 54, నిర్మల్ జిల్లా ఎడిబిడ్ లో 53, నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తొండకూరులో 52 మిలిమీటర్ల వర్షం కురిసింది.


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ షాపూర్ నగర్ లో , కాప్రా పరిధిలోని కుషాయిగూడ, జీడిమెట్లలో 37 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. ఉప్పల్ రామంతాపూర్ లో 36, నేరెడ్ మెట్ లో 35, కుత్బుల్లాపూర్ లో 34, గాజుల రామారంలో 33, అల్వాల్ కొత్తబస్తిలో 32, కూకట్ పల్లి బాలానగర్, కేపీహెచ్బీలో 30 మిల్లిమీటర్ల వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఏకధాటిగా వర్షం కురవడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమలమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడిక్కకడ నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


Read also: Cheteshwar Pujara Record: చతేశ్వర్ పుజారా చెత్త రికార్డు.. ఏకంగా 12 సార్లు..!


Read also: Pavitra Lokesh: నరేష్ తో బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలా?.. ప్లీజ్ సపోర్ట్ చేయండి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి



Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook