Pocharam Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కరోనా(covid-19) నుంచి కోలుకున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్‌(Discharge) అయ్యారు. కొవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో..ఈనెల 24న ఆయన  గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. ముందు జాగ్రత్తగా అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో వైద్యులు ఆయన్ను ఇంటికి పంపారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి మరి కొన్ని రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే పోచారం మనవరాలు స్నిగ్ధారెడ్డి వివాహం జరిగింది. ఈ వేడుకకు తెలుగు రాష్ట్రాల సీఎంలతోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యిన సంగతి తెలిసిందే. అనంతరం పోచారం కరోనా బారిన పడ్డారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు కొవిడ్ పరీక్షలు(Covid Tests) చేయించుకోవాలని ఆయన సూచించారు. 


Also Read: Pocharam Srinivas reddy: తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా...ఆస్పత్రిలో చేరిక..


కొత్త వేరియంట్ పై ప్రధాని సమీక్ష
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంటే(New Variant) కలకలం రేపుతోంది. దీనికి 'ఒమిక్రాన్' గా నామకారణం చేశారు. దీంతో పలు దేశాలు మళ్లీ ఆంక్షలు బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ(PM Modi) దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook