Srisailam: కృష్ణమ్మ బిర బిర పరుగులేడుతోంది. దీంతో కృష్ణా పరివాహాక  ప్రాంతాల్లో వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్ట్ కు ఎగువన కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి, జూరాలా, నారాయణ పూర్, సుంకేసుల వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్ట్ లోని 12 క్రస్టు గేట్లలో 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఉన్న రెండు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్పత్తిని మొదలుపెట్టి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక శ్రీశైలం జలాశయానికి జూరాల ప్రాజెక్ట్ నుంచి 2,75,960 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. అలానే సుంకేసుల నుండి 61,931 క్యూసెక్కులు శ్రీశైలానికి ఇన్ ఫ్లోగా ఉంది. మొత్తంగా  శ్రీశైలం ప్రాజెక్ట్  జలాశయానికి ఇన్ ఫ్లోగా 3,37,891 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.


10 రేడియల్ క్రెస్టు గేట్ల ద్వారా 2,76,620 క్యూసెక్కులు నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. అలానే కుడి,ఎడమ జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా 56,446 క్యూసెక్కులు మొత్తంగా శ్రీశైలం జలాశయం నుండి దిగువకు ఒదలుతున్నారు. దీంతో శ్రీశైలం నుంచి మొత్తం  ఔట్ ఫ్లో గా 3,33,066 క్యూసెక్కుల వరద నీరును.. నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.


అయితే శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు ఉంది. ప్రస్తుత నీటి మట్టం 884 అడుగులకు చేరింది. అలానే పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 210.5133 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగితే జలాశయం గేట్లను మరింత ఎత్తు పెంచి  దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు శ్రీశైలం గేట్లు ఎత్తడంతో ఆ నది పరివాహాక ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter