Sandhya Theatre Sritej: శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ తాజాగా విడుదల చేశారు. శ్రీతేజ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కళ్లు కూడా తెరుస్తున్నాడు కానీ, గుర్తుట్టడం లేదని పేర్కొన్నారు. ఫీడింగ్‌ కూడా తీసుకోగలుగుతున్నాడు, అప్పుడప్పుడు ఫిట్స్‌ వస్తున్నాయి అని కిమ్స్‌ ఆసుపత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్‌ను ఇటీవలె కమిషనర్ సీవీ ఆనంద్‌ కూడా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు శ్రీతేజ్‌ బ్రెయిన్ డ్యామేజ్‌ అయ్యింది, రికవరీ కావడానికి సమయం పడుతుందన్నారు. అప్పుడు కూడా శ్రీతేజ్‌ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. తాజాగా మరోసారి ఈరోజు శ్రీతేజ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.


అయితే, ప్రస్తుతం శ్రీతేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. కానీ, ఎవరినీ గుర్తుపట్టడం లేదని హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. సంధ్య థియేటర్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో ఈనెల 4వ తేదీ రాత్రి 'పుష్ప2' ప్రీమియర్‌ షో వేశారు. ఆ సినిమా చూసేందుకు చాలామంది వచ్చారు. అదేసమయంలో హీరో అల్లు అర్జున్‌, రశ్మిక ఇతర కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. అక్కడ అల్లు అర్జున్‌ జులూస్‌ తీయడంతో ఒక్కసారిగా అభిమానులు అల్లు అర్జున్‌ను చూసేందుకు వచ్చారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చింది ఓ ఫ్యామిలీ. తొక్కిసలాటలో రేవతి అనే మహిళతోపాటు ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో రేవతి మృతి చెందింది. శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి శ్రీతేజ్‌కు కిమ్స్‌ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.


ఇదీ చదవండి:  ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టెంపో నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు..


ఈ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్‌ విడుదల చేశారు. ఈ క్రమంలో శ్రీతేజ్‌ తండ్రి కూడా కేసు వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పారు. తీవ్ర ఉత్కంఠ మధ్య ఆయనుకు మధ్యంతర బెయిల్‌ కూడా మంజూరు చేశారు. ఒకరోజు చంచల్‌గూడ జైలులో ఉన్న అల్లు అర్జున్‌ మరుసటి రోజు ఉదయం జైలు నుంచి విడుదల చేశారు. ఆ తర్వాత వెంటనే ఆయన గీతా ఆర్ట్స్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్‌ను పెద్ద ఎత్తున కలవడానికి సినీ సెలబ్రిటీలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రెస్‌తో అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ కూడా మాట్లాడారు. పొరపాటున జరిగింది జరిగిందని క్షమించండి. వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని చెప్పారు. ఇక బాక్సాఫీస్‌ వద్ద పుష్ప2 కలెక్షన్ల సునామీ సృష్టించింది. రికార్డులను బ్రేక్‌ చేసింది. హిందీలో కూడా బంపర్‌ హిట్‌ అందుకుంది. గంగాలమ్మ జాతర పాటలో అల్లు అర్జున్‌ డ్యాన్స్‌కు నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందేనని ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.


ఇదీ చదవండి:  రైతులకి బిగ్ అలెర్ట్.. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే పీఎం కిసాన్ డబ్బులు పడవు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook