T-SAT Free Coaching For SSC Jobs | తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త వచ్చింది. అందులోనూ మీరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(Staff Selection Commission) లాంటి కేంద్ర ప్రభుత్వ కొలువులకు ప్రిపేర్ అవుతున్నారా.. అయితే మీకు ఇది కచ్చితంగా శుభవార్తే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఎస్ఎస్‌సీకి సంబంధించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(CGL), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్(CHSL) ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(CGL), కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ లాంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC Latest Update) ఉద్యోగాకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు జనవరి 27 నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది.


Also Read: EWS Reservation: తెలంగాణలో 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు
 

తెలంగాణ శాట్ (T-SAT Online Classes) ఎస్ఎస్‌సీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనుంది. టీశాట్ ఛానెల్స్‌లో పలు సబ్జెక్టులు బోధించనున్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో కోచింగ్ ఇవ్వనున్నారు. మొత్తం 75 రోజులపాటు తెలంగాణ(Telangana) శాట్ కోచింగ్, మాక్ టెస్టులు ఆసక్తిగల అభ్యర్థులకు అందుబాటులో ఉండనున్నాయి. 


Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి



జనవరి 27 నుంచి ఏప్రిల్ 12వరకు క్లాసులు ప్రసారం చేయనున్నారు. ఏవైనా సందేహాలున్న అభ్యర్థులు మరిన్ని వివరాలకు 040-23540326, 1800 425 4039 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. మరోవైపు వచ్చే నెల నుంచి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ల ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు ఇటీవల ప్రకటించడం తెలిసిందే.


Also Read: Singareni Jobs: సింగరేణిలో 372 పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook