Singareni Jobs: సింగరేణిలో 372 పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా

Singareni Recruitment 2021: How To Apply For Singareni Jobs: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ నిరుద్యోగులకు సింగరేణి కాలరీస్ శుభవార్త అందించింది. మొత్తం 651 ఖాళీలు ఉండగా.. ప్రస్తుతం తొలి విడత నోటిఫికేషన్‌లో 372 ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు సింగరేణి మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 22, 2021, 10:46 AM IST
  • సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది
  • మొత్తం 651 ఖాళీలు ఉండగా.. తొలి విడత నోటిఫికేషన్‌లో 372 ఉద్యోగాలు భర్తీ
  • 372 ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల
Singareni Jobs: సింగరేణిలో 372 పోస్టులు.. దరఖాస్తు చేసుకున్నారా

Singareni Recruitment 2021: How To Apply For Singareni Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి తొలి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 651 ఖాళీలు ఉండగా.. ప్రస్తుతం తొలి విడత నోటిఫికేషన్‌లో 372 ట్రైనీ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు సింగరేణి ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. 372 ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి సింగరేణి సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 372 పోస్టులకుగానూ స్థానిక రిజర్వేషన్‌ కింద ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ అభ్యర్థులతో 305 పోస్టులను భర్తీ చేస్తారు. మిగిలిన పోస్టులను ఏ రిజర్వేషన్ లేకుండా అన్‌ రిజర్వుడు కింద తెలంగాణ(Telangana)లోని అన్ని ప్రాంతాల వారికి కేటాయించారు. జనవరి 22న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించారు.

Also Read: SBI PO Result 2021: ఎస్‌బీఐ పీఓ ప్రిలిమ్స్ 2021 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

మొత్తం పోస్టులు : 372 ట్రైనీ ఉద్యోగాలు
ఫిట్టర్‌ - 128 పోస్టులు
జూనియర్‌ స్టాఫ్‌నర్సు - 84 పోస్టులు
ఎలక్ట్రీషియన్‌ - 51 పోస్టులు
వెల్డర్‌ - 54 పోస్టులు
టర్నర్‌/మెషినిస్టు - 22 పోస్టులు
ఫౌండ్రీమెన్‌/మౌల్డర్‌ - 19 పోస్టులు
మోటారు మెకానిక్‌ - 14 పోస్టులు

సింగరేణి అధికారిక వెబ్‌సైట్ : http://www.scclmines.com/ లో దరఖాస్తు చేసుకోవాలి. మొదట వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్ ఫామ్ తీసుకుని పూర్తి వివరాలు నింపిన తర్వాత సింగరేణి ప్రధాన కార్యాలయానికి హార్డ్‌ కాపీని పంపాలి. ఫిబ్రవరి 4తో దరఖాస్తుల తుది గడువు ముగియనుంది.

సింగరేణి జాబ్స్ 2021 నోటిఫికేషన్ Link 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News