ABVP Call for Schools Bandh in Telangana: బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఇవాళ తెలంగాణవ్యాప్తంగా స్కూల్స్ బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. గత నెల 2న నాంపల్లిలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలంటూ పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో పాల్గొన్న ఏబీవీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడమే కాక.. శాంతియుతంగా ఆందోళన చేపట్టిన తమపైనే కేసులు పెట్టారని ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 34 మంది విద్యార్థులపై కేసులు పెట్టారని ఏబీవీపీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని.. ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండుకు పంపించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్లలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. ఫీజుల పేరిట విద్యార్థుల తల్లిదండ్రులను వేధించే స్కూళ్లను సీజ్ చేయాలని కోరుతోంది. ఇవాళ ఏబీవీపీ బంద్ పిలుపుతో స్కూల్స్ తెరుచుకుంటాయా లేదా అన్న సందిగ్ధం విద్యార్థులను వెంటాడుతోంది. 


Also Read: Beer Benifits: బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదే.. ఎలా అంటే.. పోర్చుగీస్ యూనివర్సిటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు..


Also Read: CM KCR: మోడీ, షా దెబ్బకు వణుకుతున్న కేసీఆర్.. ఈటలతో టచ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook