Beer Benefits: బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదే.. ఎలా అంటే.. పోర్చుగీస్ యూనివర్సిటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు

Research on Drinking Beer: బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే.. మంచిదేనని చెబుతోంది పోర్చుగీస్ యూనివర్సిటీకి చెందిన ఓ పరిశోధక బృందం. ఇటీవలి తమ రీసెర్చ్‌లో బీర్ ఆరోగ్యానికి మంచిదేనని గుర్తించినట్లు వర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.  

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 5, 2022, 10:18 AM IST
  • బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా
  • మంచిదే అంటున్నారు పోర్చుగీస్ యూనివర్సిటీ పరిశోధకులు
  • అదెలాగో ఇటీవల ప్రచురితమైన ఓ జర్నల్ ద్వారా వెల్లడించారు.
Beer Benefits: బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదే.. ఎలా అంటే.. పోర్చుగీస్ యూనివర్సిటీ పరిశోధనలో ఆసక్తికర విషయాలు

Research on Drinking Beer: బీర్ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా.. ఈ ప్రశ్న వైద్య నిపుణులను అడిగితే కచ్చితంగా నో అనే చెబుతారు. కానీ పోర్చుగీస్‌కి చెందిన నోవా యూనివర్సిటీ పరిశోధనలో మాత్రం బీర్ ఆరోగ్యానికి మంచిదేనని తేలడం గమనార్హం. రోజూ కొద్ది మొత్తంలో బీర్‌ను సేవించడం ద్వారా శరీరంలో మంచి బాక్టీరియా పెరుగుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ బెనిఫిట్ ఆల్కాహాలిక్‌తో పాటు నాన్ ఆల్కాహాలిక్‌ బీర్ రెండింటి ద్వారా కలుగుతుందని తేలింది.

రీసెర్చ్ జరిగిందిలా :

పోర్చుగల్‌లోని లిస్బన్‌కి చెందిన నోవా యూనివర్సిటీ పరిశోధకులు 19 మందిపై ఈ పరిశోధన జరిపారు. వీరి సగటు వయసు 35 సంవత్సరాలు. పరిశోధనలో భాగంగా నాలుగు వారాల పాటు ప్రతీ రోజూ వీరంతా 325 మి.లీ బీర్‌ను సేవించారు. వీరిలో కొందరు నాన్ ఆల్కాహాలిక్ బీర్ సేవించగా.. మరికొందరు ఆల్కాహాలిక్ బీర్ సేవించారు. వీరు సేవించిన ఆల్కాహాలిక్ బీర్‌లో 5.2 శాతం ఆల్కాహాల్ ఉంది. అంటే ఇది స్ట్రాంగ్ బీర్ కేటగిరీకి కిందకు వస్తుంది. నాలుగు వారాల తర్వాత ఆ 19 మంది రక్త నమూనాలు, మల వ్యర్థాలను సేకరించి పరిశోధన జరిపారు.

రీసెర్చ్‌లో తేలిందేంటంటే.. :

పోర్చుగీస్ పరిశోధకులు చేసిన ఈ పరిశోధన వివరాలను జర్నల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీ అనే జర్నల్‌లో ప్రచురించారు. ఆ కథనం ప్రకారం.. బీర్ తాగడం వల్ల మనిషి పేగుల్లో మంచి బాక్టీరియా పెరుగుతుందని తేలింది. ఇందులో వైవిధ్యమైన బాక్టీరియా ఉందని.. ఇది మొత్తం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని వెల్లడైంది. అంతేకాదు,రోజూ బీర్ తాగడం శరీర బరువు లేదా బాడీ మాస్ ఇండెక్స్‌పై ఎలాంటి ప్రభావం చూపదని తేలింది. అలాగే గుండె, రక్తం, జీవక్రియలపై దుష్ప్రభావం ఉండదని తేలింది.

బీర్ తాగితే మంచి బాక్టీరియా ఎలా పెరుగుతుంది..?

బీర్‌లో పాలిఫినాల్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని కారణంగా మనిషి పేగుల్లో మంచి బాక్టీరియా పెరుగుతుందని తెలిపారు. మానవ శరీరంలో వైవిధ్యమైన బాక్టీరియా ఉండటం మంచిదేనని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. 

Also Read: Rains in Telangana: తెలంగాణలోని ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్.. నేటి నుంచి 5 రోజుల పాటు భారీ వర్షాలు...  

Also Read: Horoscope Today July 5th: నేటి రాశి ఫలాలు.. ఆ రంగాల్లోని వ్యాపారులకు ఇవాళ ధన లాభం...  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News