SI harassment: బైట పడ్డ మరో ఎస్సై బాగోతం.. చికెన్ వండి కోపరేట్ చేయ్యాలని మహిళకు లైంగిక వేధింపులు..
Nalgonda news: భూ తగాదా విషయంలో పోలీసు స్టేషన్ కు వెళ్లిన మహిళకు షాకింగ్ అనుభవం ఎదురైంది. స్టేషన్ ఎస్సై తనకు కోపరేట్ చేయాలని, చేపలకూర, చికెన్ వండుకు తేవాలంటూ వేధించాడని బాధితురాలు వాపోయింది.
Subinspector harassed woman in Nalgonda: సమాజంలో మహిళల భద్రత ప్రస్తుతం పెనుసవాల్ గా మారింది. మహిళలు, అమ్మాయిలు ప్రతిరోజు అత్యాచార ఘటనలు, వేధింపులకు గురౌతున్నారు. ప్రభుత్వాలు నిర్భయ,అభయ, పోక్సో వంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినకూడా కామాంధులలో మార్పులు మాత్రం రావడంలేదు. బస్టాండ్ లు, రైల్వేస్టేషన్ లు, ఆఫీసులు ఇలా ప్రతిచోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. ఇక తమకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడానికి వెళ్లే... అక్కడ కూడా అదే సేవ్ సీన్ రిపీట్ అవుతున్నాయి. కొందరు అధికారులు పీఎస్ కు వచ్చే మహిళ బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
Read more: Python in scooty: వామ్మో.. స్కూటీ ట్రంక్ లో భారీ కొండ చిలువ.. వీడియో వైరల్..
ఫోన్ నంబర్ లకు మెస్సెజ్ లు చేసి, లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. అంతటితో ఆగకుండా.. తమకు సహకరించకపోతే.. కేసు విషయంలో ఇబ్బందులు పెడుతామంటూ బెదిరిస్తున్నారు. బాధితుల బలహీనతలను ఆసరగా చేసుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు ఇలాంటి పనులు చేసిన కూడా.. డిపార్ట్ మెంట్ అంతటికి చెడ్డపేరు వస్తుంది. ఈ నేపథ్యంలో తాజగా.. నల్లగొండ లో ఈ కోవకు చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు..
నల్లగొండ జిల్లా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. శాలిగౌరారం మండలానికి చెందిన ఓ మహిళ భూమితగాదా విషయంలో జరిగిన ఘర్షణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే శాలిగౌరారం ఎస్ఐ వాస ప్రవీణ్ కుమార్ ఆమెను స్టేషన్‌కు పిలిపించాడు. సదరు మహిళకు, ఆమె భర్తకు కూడా గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..సదరు ఎస్సై మహిళను పీఎస్ లో పిలిపించుకుని తన క్యాబిన్ లో కూర్చొబెట్టి వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఇటీవల ఎస్పీదగ్గరకు వెళ్లి తన కన్నీళ్లు పెట్టుకుంది.
తనతో ఎస్సై చాలా అసహ్యంగా ప్రవర్తించేవాడని..భర్తతో దూరంగా ఎందుకు ఉంటున్నావ్.. నాతో కోపరేట్ చేస్తే కేసు పరిష్కరిస్తానంటూ అసహ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు ఎస్పీకి చెప్పింది. అంతేకాకుండా..ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని, చేపల కూర, చికెన్ కూర వండుకుని రావాలని, గ్రీన్ టీ చేసి పెట్టాలని కూడా ఎస్సై వేధించినట్లు బాధితురాలు చెప్పుకొచ్చింది. రెండు గంటలపాటు తన ఛాంబర్లో ఉంచి, అభ్యంతరకరంగా మాట్లాడడంతోపాటు వేధింపులకు గురిచేసినట్లు చెప్పింది.
తనతో మంచిగా ఉంటే పూర్తి సహకారం ఉంటుందని ఎస్ఐ చెప్పినట్లు ఎస్పీ ఎదుట సదరు మహిళ బోరున విలపించారు. ఈ మేరకు ఎస్పీ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఎస్సైపై కేసునమోదు చేసి, దర్యాప్తుచేయాలని సీఐకు, డీఎస్పీలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ ను కూడా లేడీ కానిస్టేబుళ్లను వేధించి, గన్ తో బెదిరించి అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన మరువక ముందే మరో మహిళలకు పోలీసు వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో డిపార్ట్ మెంట్ లో తీవ్ర సంచలనంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి