Netherlands aircraft canopy bursts open mid air video: విమానంలో చాలా మంది ప్రయాణించడానికి భయపడిపోతుంటారు. ఇటీవల విమానాలు తరచుగా ప్రమాదాలకు గురౌతున్న ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. ఏకంగా దేశాధినేతలు ప్రయాణించిన విమానాలు, జెట్ లలో సైతం సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి. ఇక మరోవైపు కొందరైతే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే.. విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు విమానాలను పక్షులు బలంగా ఢీకొట్టడం వల్ల ప్రమాదాలకు గురౌతుంటాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఒక లేడీ పైలేట్ తనకు ఎదురైన భయానక అనుభవం గురించి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
*PLEASE MIND WHEN WATCHING. AT 2:17 MINUTE MARK VIDEO FOOTAGE BECOMES RATHER INTENSE*
A couple of years ago during my second aerobatic training flight of that day, on a very hot summer day, the canopy of the Extra 330LX that I was flying opened in flight and shattered. As you… pic.twitter.com/nLhvDqVnII
— Narine Melkumjan (@NarineMelkumjan) June 22, 2024
పూర్తివివరాలు..
నెదర్లాండ్స్ కు చెందిన నరైన్ మెల్కుమ్జాన్ అనే లేడీ పైలట్.. తేలికపాటి విమానం నడిపించడంతో ట్రైనింగ్ తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె ఎక్స్‌ట్రా 330LX అనే విమానంలో తన జర్నీ స్టార్ట్ చేసింది. విమానం ఆకాశంలోకి బాగానే ఎగిరింది. మరీ ఏమైందో కానీ.. ఒక్కసారిగా విమానంపై కప్పు సడెన్ గా ఓపెన్ అయ్యింది. ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఒక వైపు వేగంగా గాలి, మరోవైపు తనకుతానుగా విమానంను నియంత్రించుకుంది. చాకచక్యంగా వ్యవహరించి విమానం టేకాఫ్ అయ్యేలా చేసుకుంది.
ఈ ఘటన రెండేళ్ల క్రితం జరిగిందని సదరు యువతి మెల్కుమ్జాన్ చెప్పుకొచ్చింది. తాను..టేకాఫ్‌కి ముందు సరైన తనిఖీలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తన అనుభవం పంచుకుంది. కరోనా సమయంలో తనకు ఈ అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. విమానం లాకింగ్ పిన్ సరిగ్గా పడలేదని అందుకే.. ఈ ఘటన ఎదురైందని యువతి చెప్పుకొచ్చించి. తనకు గతంలో కరోనా ఎఫెక్ట్ అయ్యిందని, కనీసం కళ్లజోడు కూడా తాను పెట్టుకొలేదని, ఒక వేళ ధరించి ఉంటే తన కళ్లకు ఇబ్బంది కలిగేది కాదని చెప్పింది.
Read more: Pythons: కొండ చిలువలు ఒక మనిషిని ఎంత సేపట్లో మింగేస్తాయో తెలుసా..?
మరోవైపు సరిగ్గా చూడలేక, శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చింది. తన కంటి చూపు విషయంలో పూర్తిగా కోలుకోవడానికి దాదాపు 28 గంటలు పట్టిందని బాధపడింది. ఈ క్రమంలో.. సదరు యువతి తనకు కల్గిన భయానక అనుభవం, పైలేట్లకు ఒక పాఠంలాగా ఉపయోగపడుతుందని కూడా చెప్పింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. లేడీ పైలేట్ సాహాసానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు గ్రేట్ మేడమ్ అంటూ.. ఆ సమయంలో ధైర్యంగా ఉండటం నిజంగా..మెచ్చుకొవాల్సిందే.. అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి