Summer Trains: వేసవి రద్దీ, హైదరాబాద్ నుంచి తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే
Summer Trains: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ఎక్కడికక్కడ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Summer Trains: వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే ఎక్కడికక్కడ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది. సౌత్ సెంట్రల్ రైల్వే తిరుపతికి 20 ప్రత్యేక రైళ్లు ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..
వేసవి సెలవులు కావడంతో ఎక్కడికక్కడ ప్రయాణీకులు రద్దీ పెరుగుతోంది. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు కిటకిటలాడుతున్నాయి. టికెట్ల కోసం నిరీక్షణ తప్పడం లేదు. మరోవైపు సెలవుల నేపధ్యంలో తిరుపతి వంటి పుణ్యక్షాత్రాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే వేసవి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది.
తిరుపతిలో గత వారం రోజులుగా పోటెత్తున్న భక్తజనాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-తిరుపతి మధ్య 20 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే. మే 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో హైదరాబాద్ నుంచి తిరుపతికి ఐదు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. అదే సమయంలో తిరుపతి నుంచి హైదరాబాద్‌కు జూన్ 1,8,15,22,29 తేదీల్లో ఐదు ప్రత్యైక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.ఈ ప్రత్యేక రైళ్లకు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది.
Also read: POWER PROJECT: సీఎం కేసీఆర్ నుంచి ప్రధాని మోడీ కమీషన్ తీసుకుంటున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook