Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఒకేసారి 32 జిల్లా న్యాయస్థానాలు ప్రారంభమయ్యాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ ఈ న్యాయస్థానాల్ని లాంచ్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణలో జిల్లాల వికేంద్రీకరణతో 32 జిల్లాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ప్రతి జిల్లాకు ఓ న్యాయస్థానం కూడా ఏర్పడాల్సిన అవసరమేర్పడింది. ఇందులో భాగంగా 32 జిల్లాలకు 32 కొత్త న్యాయస్థానాలు ఏర్పడ్డాయి. ఈ జ్యుడీషియల్ జిల్లాల్ని సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ ఎన్ వి రమణ ప్రారంభించారు. కొత్త న్యాయస్థానాల ఏర్పాటు, న్యాయవ్యవస్థ వికేంద్రీకరణ గురించి జస్టిస్ ఎన్ వి రమణ మాట్లాడారు. 


సంక్షేమ రాజ్యంలో సంక్షేమ పాలనను అందించడం రాజ్యాంగం అప్పగించిన బాధ్యతని జస్టిస్ ఎన్ వి రమణ తెలిపారు. అదే సమయంలో అవసరమైనవారికి న్యాయం అందించడం కూడా ఓ భాగం. సాధారణ పరిపాలన వికేంద్రీకరణతో పాటు న్యాయ సేవల వికేంద్రీకరణ కూడా జరగడం ఓ మంచి పరిణామమన్నారు జస్టిస్ ఎన్ వి రమణ. దేశంలో ఇంత భారీ స్థాయిలో న్యాయ వికేంద్రీకరణ జరగడం ఇదే తొలిసారి అని చెప్పారు. 1980 దశకంలో నాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు మండల వ్యవస్థతో పరిపాలనా వికేంద్రీకరణ చేపట్టారని..ఇప్పుడు న్యాయ వికేంద్రీకరణతో ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన చర్య తీసుకున్నారని ప్రశంసించారు. 


న్యాయ సేవల వికేంద్రీకరణ ఫలితాల్ని అందుకోవల్సిన బాధ్యత న్యాయవాదులు, కక్షిదారులపై ఉందని చెప్పారు జస్టిస్ ఎన్ వి రమణ. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్‌లో వేలాది కేసులు పెండింగులో ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 1 లక్షా 81 వేల 271 కేసులు పెండింగులో ఉన్నాయి. కొత్తగా మూడు జ్యుడీషియల్ జిల్లాలతో ఆ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. 


న్యాయవ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయాలంటే..సరైన వ్యవస్థ ఉండాలని చెప్పినట్టు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్ వి రమణ గుర్తు చేశారు. తెలంగాణలో పెద్ద ఎత్తున జ్యుడీషియల్ జిల్లాలు ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశంసించారు. 


Also read: Bhatti Comments: హిందూత్వం ఎవరి సొత్తు కాదు..బండి సంజయ్‌పై భట్టి విక్రమార్క ఫైర్..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook