Suryapeta Bus Accident: సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు సూర్యపేట- ఖమ్మం హైవేపై చివ్వెంల ఐలాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. మిగతా బస్సు ప్రయాణికులు 17 మంది వరకు గాయపడ్డారు. మృతులంతా ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. అయితే, ఈ ప్రమాదం బస్సు టైర్‌ పేలడంతోనే జరిగిందని సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీళ్లంతా సూర్యాపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఇక చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. కూలి పనుల కోసం ఒడిశా నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ బస్సు ప్రమాదం గురించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.


ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో మైండ్ బ్లాక్..!


ఇక వాతావరణం లో మార్పులు కూడా జరగడంతో వాతావరణ శాఖ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. పొగ మంచు పూర్తిగా పేరుకుంది ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని ఇదివరకే హెచ్చరించింది.. వాహనదారులు లైట్లు వేసుకొని వెళ్లాలి ఉదయం పూట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సంక్రాంతి సందర్భంగా ఊళ్ళకు ప్రయాణాలు కూడా మొదలయ్యాయి. రేపటి నుంచి వీకెండ్‌ కారణంగా ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. ఈరోజు 10వ తేదీ నుంచి స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు తీసుకొని ప్రయాణాలు చేయాలి. ముఖ్యంగా ఉదయం పూట ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు వహించాలి. వాతావరణంలో మార్పుల కారణంగా పొగ మంచు కూడా పూర్తిగా పేరుకుంటుంది. ఆ సమయంలో ప్రయాణాలు చేయడం మానుకోవడం మంచిది.


ఇదీ చదవండి: తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు.. శ్రీవారికి ప్రత్యేక పూజలు..  


తెలంగాణలో చలితీవ్రత పెరిగింది. ఈ నేపథ్యంలో పొగమంచు కూడా పెరిగింది. ఉదయం పూట ప్రయాణాలు చేసేవారికి ఇది ఇబ్బందిగా మారింది. వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.