PF Account Big News: మీకు పీఎఫ్ ఎక్కౌంట్ ఉందా, ఇలా చేస్తే 2.5 కోట్ల ఫండ్, ఎలాగంటే

ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ లేదా ఈపీఎఫ్ అనేది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించింది. పదవీ విరమణ అనంతరం ఆర్ధిక భద్రత కల్పించే సేవింగ్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్‌లో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు చెక్ చేద్దాం. క్రమ పద్ధతిలో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ సమయానికి ఏకంగా 2.5 కోట్లు జమ చేయవచ్చంటే నమ్మగలరా...ఎలాగో తెలుసుకుందాం..

PF Account Big News: ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ లేదా ఈపీఎఫ్ అనేది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించింది. పదవీ విరమణ అనంతరం ఆర్ధిక భద్రత కల్పించే సేవింగ్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్‌లో మనకు తెలియని ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు చెక్ చేద్దాం. క్రమ పద్ధతిలో ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే పదవీ విరమణ సమయానికి ఏకంగా 2.5 కోట్లు జమ చేయవచ్చంటే నమ్మగలరా...ఎలాగో తెలుసుకుందాం..

1 /8

ఈపీఎఫ్ఓ సభ్యుడు సర్వీస్ ఉండగా మరణిస్తే అతని నామినీ లేదా చట్టపరంగా వారసునికి 6 లక్షల వరకూ బీమా మొత్తం అందుతుంది. 

2 /8

పీఎఫ్ ఎక్కౌంట్ కలిగిన ఉద్యోగులకు డీఫాల్ట్ బీమా సౌకర్యం కూడా లభిస్తుంది. ఎంప్లాయి డిపాజిట్ లింక్ట్ ఇన్సూరెన్స్ కింద ఉద్యోగికి 6 లక్షల వరకూ కవరేజ్ ఉంటుంది. 

3 /8

ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉంటే ఇన్వెస్ట్‌మెంట్‌తో పాటు బీమా ప్రయోజనం, పెన్షన్, ట్యాక్స్ మినహాయింపు ఉంటాయి. అత్యవసరమైనప్పుడు కొంత డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు

4 /8

ఈపీఎఫ్ఓ సభ్యునిగా చేరాలంటే సంస్థాగత రంగంలో పనిచేస్తుండాలి. మీరు పనిచేసే సంస్థ కూడా 20 లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగుల్ని కలిగి ఉండాలి. 

5 /8

దీనికోసం పీఎఫ్ సభ్యునికి 30 ఏళ్ల సర్వీస్ ఉండాలి. పీఎఫ్ ఫండ్‌పై ప్రభుత్వం 8.1 శాతం వడ్డీ అందిస్తుంది. మీ జీతం ఏడాదికి 5 శాతం పెరుగుతుంటే ఇన్వెస్ట్‌మెంట్, వడ్డీ కూడా పెరుగుతుంది. దాంతో రిటైర్మెంట్ సమయానికి 2.5 కోట్లు పొందవచ్చు.

6 /8

మ్యూచ్యువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే 2.5 కోట్లు జమ చేయవచ్చు. పీఎఫ్ ఖాతాలో 2.5 కోట్లు పొందేందుకు 50 వేలు జీతం ఉండాల్సి ఉంటుంది.

7 /8

పీఎఫ్ ఎక్కౌంట్‌లో జమ అయ్యే మొత్తంపై ప్రభుత్వం ప్రతి యేటా వడ్డీ చెల్లిస్తుంది. ఉద్యోగి పదవీ విరమణ తరువాత వడ్డీతో సహా ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఒకేసారి పొందుతాడు. తద్వారా భారీ మొత్తం డబ్బులు చేతికి అందుతాయి. ఇది పూర్తిగా ట్యాక్స్ రహితమైంది. 

8 /8

ప్రతి ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగికి ఇటు యజమాని అటు ఉద్యోగి నుంచి ప్రాధమిక జీతంలో 12 శాతం పీఎఫ్ ఖాతాలో ప్రతి నెలా జమ అవుతుంటుంది. అంటే నెలకు 24 శాతం పీఎఫ్ ఎక్కౌంట్‌లో పడిపోతుంటుంది.