1000 కోట్ల మోసానికి స్కెచ్ వేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ
స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ ( Swadhathri infra pvt ltd ) పేరిట యార్లగడ్డ రఘు అండ్ గ్యాంగ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ పాల్పడిన మోసాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యార్లగడ్డ రఘు వాస్తవానికి ఏడాదిలోపే రూ. 1000 కోట్లు కొల్లగొట్టాలని పథకం రచించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
స్వధాత్రి ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ ( Swadhathri infra pvt ltd ) పేరిట యార్లగడ్డ రఘు అండ్ గ్యాంగ్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ పాల్పడిన మోసాలు పోలీసుల విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న యార్లగడ్డ రఘు వాస్తవానికి ఏడాదిలోపే రూ. 1000 కోట్లు కొల్లగొట్టాలని పథకం రచించినట్టు పోలీసుల విచారణలో తేలింది. రఘు బృందం స్కెచ్ వేసినట్టుగానే జరిగి ఉండి ఉంటే.. వారి చేతిలో మోసపోయిన బాధితుల జాబితా మరింత పెరిగేదే. కానీ అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) నివారణకు లాక్ డౌన్ విధించడంతో అన్ని వ్యాపారాల మాదిరిగానే వీరి వ్యాపారం కూడా ముందుకెళ్లలేదు. అలా వారి ప్లాన్ కాస్తా బెడిసి కొట్టింది. అయితే, అప్పటికే రఘు అండ్ గ్యాంగ్ 150 కోట్లకు పైగా మోసానికి పాల్పడినట్టు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ( Also read: Jackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం )
స్వధాత్రి రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్లాట్లపై పెట్టుబడి పెట్టిన వాళ్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును మొత్తం కూడా ఆస్తుల రూపంలోకి మార్చుకున్న రఘు.. ఆ ఆస్తిని తన కుటుంబ సభ్యులు, సమీప బంధు మిత్రులు పేర్లపైకి మార్చినట్టు తెలుస్తోంది. అలా విజయవాడ, హైదరాబాద్‌లలో 15 మంది ఏజెంట్ల పేర్లపై రఘు బినామి ఆస్తులు ( Binami properties) కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో బయటపడింది. Also read: Viral Video: భూమి ఊపిరి పీల్చుకోవడం ఎప్పుడైనా చూశారా ?
రఘు చేతిలో మోసపోయిన వారి సంఖ్య వెయ్యి మందికిపైగానే ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మీరు చేరిన అనంతరం మరో ముగ్గురిని చేర్పించండి ( Chain marketing scams).. అమ్ముడుపోయే ఫ్లాట్స్‌పై కమిషన్ పొందండి ఆశ చూపించి భారీ సంఖ్యలో జనాన్ని మోసం చేసిన వైనం ఒక్కొక్కటి విచారణలో బయటపడుతోంది. ముఖ్యంగా అధిక మొత్తంలో లాభాలు వస్తాయని ఆశపడిన వారే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. Also read: COVID-19: ఏపీలో 24 గంటల్లో 7,813 కరోనా కేసులు, 52 మంది మృతి