తెలంగాణలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ
సాంప్రదాయకంగా జనవరి నెలలో సాధారణంగా స్వైన్ ఫ్లూ కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. శీతాకాలంలో కాలానుగుణంగా స్వైన్ ఫ్లూ కేసులతో ముంచెత్తడానికి చల్లని వాతావరణ పరిస్థితులు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా, జిల్లాలోని ప్రజారోగ్య నిపుణులు, వ్యాధి పర్యవేక్షణ అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
హైదరాబాద్ : సాంప్రదాయకంగా జనవరి నెలలో సాధారణంగా స్వైన్ ఫ్లూ కేసులలో పెరుగుదల కనిపిస్తుంది. శీతాకాలంలో కాలానుగుణంగా స్వైన్ ఫ్లూ కేసులతో ముంచెత్తడానికి చల్లని వాతావరణ పరిస్థితులు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఏదేమైనా, జిల్లాలోని ప్రజారోగ్య నిపుణులు, వ్యాధి పర్యవేక్షణ అధికారులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
ఆదివారంనాడు ఇద్దరు రోగులకు పరీక్షలు నిర్వహించారు.స్వైన్‌ఫ్లూ పాజిటివ్ అని తేలగా, దీంతో వైద్యాధికారులు ధృవీకరించారు. ఇద్దరి రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
గాంధీ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజిహెచ్), ఫీవర్ హాస్పిటల్‌లోని అవుట్ పేషెంట్ విభాగాల్లో రోగుల ప్రవాహం డిసెంబర్ నుండి క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుందని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో జన సమూహం అత్యధికంగా ఉండే ప్రదేశాల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైద్రాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ మాట్లాడుతూ.. ప్రజలు స్వైన్ లక్షణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ లు ధరించాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు.
గత డిసెంబర్ నెలలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఈటల రాజేందర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టివివిపి) పరిధిలోని అన్ని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారులు (డిహెచ్ & హెచ్ఓలు), ఏరియా హాస్పిటల్స్ సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా, స్వైన్ ఫ్లూ రోగుల కోసం ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులలో 500 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేయాలని సూచించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..