మంత్రి అయితే మాకేంటి..?
ఆయన తెలంగాణ కేబినెట్ లో మంత్రి.. ఇంకా చెప్పాలంటే. . తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అందులోనూ హైదరాబాద్ కు చెందిన స్థానికుడు . అయినా జీహెచ్ ఎంసీ అధికారులు .. ఆయనకు జరిమానా విధించారు.
ఆయన తెలంగాణ కేబినెట్ లో మంత్రి.. ఇంకా చెప్పాలంటే. . తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ కి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి. అందులోనూ హైదరాబాద్ కు చెందిన స్థానికుడు . అయినా జీహెచ్ ఎంసీ అధికారులు .. ఆయనకు జరిమానా విధించారు.
జీహెచ్ఎంసీ అధికారులు. . గత కొద్ది కాలంగా. . హైదరాబాద్ లో హోర్డింగ్ లు, ఫ్లెక్సీల ఏర్పాటుపై సీరియస్ గా ఉన్నారు. వాటి వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని .. వీలైనంత వరకు వాటిని నిరోధిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా హోర్డింగ్ లేదా ఫ్లెక్సీ పెట్టాలన్నా. . గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఏ పార్టీ వారికైనా ఈ నిబంధన తప్పనిసరి. చివరకు అధికార పార్టీ అయినా .. నిబంధనలు పాటించాల్సిందే.
[[{"fid":"182051","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"తలసాని ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇదే..!!"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":"తలసాని ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇదే..!!"}},"link_text":false,"attributes":{"title":"తలసాని ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇదే..!!","class":"media-element file-default","data-delta":"1"}}]]
తలసాని ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఇదే..!!
ఐతే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ .. అనుచరులు జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా .. హోర్డింగ్ ఏర్పాటు చేశారు. పేద్ద హోర్డింగ్ పై 'We love KCR'.. అని రాసి ఉన్న హోర్డింగ్ పెట్టారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోటోలు కూడా ఉన్నాయి. ఐతే ఫ్లెక్సీ ఏర్పాటుకు అనుమతి తీసుకోకోపవడంతో ఈ హోర్డింగ్ ను తొలగించాలని గ్రేటర్ అధికారులు నిర్ణయించారు. అంతే కాదు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు 5 వేల రూపాయల ఫైన్ విధించారు. దీంతో చేసేదేం లేక .. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫైన్ చెల్లించారు.
Read Also: మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు
మరోవైపు హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు, బ్యానర్లను వీలైనంత వరకు తగ్గించాలని.. మంత్రి కేటీఆర్ గతంలోనే విజ్ఞప్తి చేశారు. వీటి వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ఏ పార్టీ వారైనా ఇలాంటి ఏర్పాటు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు సొంత పార్టీకి చెందిన మంత్రిపైనే జరిమానా విధించడంతో . . ఆయన చెప్పింది నిజమైనట్లు తెలుస్తోంది. దీనిపై గ్రేటర్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..