Hero Vijay Meet KCR: జాతీయ రాజకీయాలపై  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారా? ఇన్ని రోజులు ఫామ్ హౌజ్ లో ఉండి ఇందుకోసం వ్యూహాలు రచించారా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అలానే అనిపిస్తున్నాయి. ఈనెల 20న పంజాబ్ వెళుతున్నారు కేసీఆర్. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో చనిపోయిన రైతు కుటుంబాలను కలిసి పరామర్శించనున్నారు. గతంలో ప్రకటించిన పరిహారం అందించనున్నారు. కేసీఆర్ పంజాబ్ పర్యటన ఖరారైన కాసేపటికే తమిళ స్టార్ హీరో విజయ్.. సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ వచ్చిన హీరో విజయ్ .. ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా విజయ్ భేటీలో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సీఎం కేసీఆర్ తో హీరో విజయ్ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు విజయ్. బీజేపీని టార్గెట్ చేస్తూ చాలా సార్లు ఓపెన్ గానే ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలను కూడగడుతున్న కేసీఆర్ తో విజయ్ సమావేశం కావడం చర్చగా మారింది. తన సినిమా గురించే మాట్లాడటానికే విజయ్ ప్రగతి భవన్ వచ్చారని ప్రచారం జరుగుతున్నా... జాతీయ స్థాయిలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కేసీఆర్, విజయ్ భేటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.


గతంలో విజయ్ ను బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. ఆయన నివాసంలో ఐటీ సోదాలు కూడా జరిగాయి. విజయ్ ని కూడా విచారించారు.  తన సినిమాల్లో బీజేపీని టార్గెట్ చేసేలా విజయ్ డైలాగ్స్ ఉన్నాయి. విజయ్ నటించిన మెర్సల్ సినిమాలో జీఎస్టీని హేళన చేస్తూ డైలాగ్స్ ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. పన్ను ఎగవేతకు సంబంధించి సోదాలు చేశామని ఐటీ అధికారులు ప్రకటించారు. సర్కార్ సినిమాలోనూ కమలం పార్టీని ఉద్దేశించి విజయ్ రాజకీయ కామెంట్లు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకే విజయ్ ను టార్గెట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి.


తనపై ఐటీ సోదాలు జరిగినా.. బీజేపీకి వ్యతిరేకంగా తగ్గేదే లే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు విజయ్. అటు కేసీఆర్ కూడా బీజేపీ టార్గెట్ గా దూకూడుగా వెళుతున్నారు. దీంతో వీళ్లద్దరి సమావేశం రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగంగానే ఈ భేటీ జరిగిందనే టాక్ వస్తోంది. బీజేపీపై పోరాటంలో కలిసి వచ్చే అన్ని శక్తులను ఏకం చేసే పనిలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీపై పోరాటంలో తనకు మద్దతుగా ఉండాలని కేసీఆర్.. హీరో  విజయ్ ను కోరారనే ప్రచారం సాగుతోంది. మొత్తంగా కేసీఆర్, విజయ్ సమావేశం తెలంగాణ పాటు జాతీయ స్థాయిలోనూ చర్చగా మారింది. 


READ ALSO: TRS Rajyasabha Names:పెద్దల సభకు ముగ్గురు వ్యాపారవేత్తలే.. చివరి నిమిషంలో కేసీఆర్ ట్విస్ట్


READ ALSO: Dist Name Change:దిగొచ్చిన సీఎం జగన్! ఆ జిల్లా పేరు మారింది..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook