టి కాంగ్రెస్‌కి మరో షాక్.. టీఆర్ఎస్లోకి మరో ఎమ్మెల్యే ?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్న వైనం పార్టీని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది.
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్స్ మీద షాక్స్ తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వరుసగా ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్న వైనం పార్టీని తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. తాజాగా మీడియాలో వెలువడుతున్న వార్తా కథనాల ప్రకారం కాంగ్రెస్ నుండి మరో ఎంఎల్‌ఎ టీఆర్ఎస్‌లో చేరడానికి సిద్ధంగా వున్నారా అంటే అవుననే తెలుస్తోంది. గత కేబినెట్‌లో మంత్రిగా వున్న పట్నం మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన తాండూరు ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారు ఎక్కేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే టిఆర్‌ఎస్ అగ్రనేతలతో పైలెట్ రోహిత్ రెడ్డి మంతనాలు జరుపుతున్నారని.. రానున్న ఒకటి, రెండు రోజుల్లో రోహిత్ రెడ్డి సైతం తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. గతంలో టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగిన పైలట్ రోహిత్ రెడ్డి.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ టికెట్ లభించకపోవడంతో ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా అందులో ఇద్దరు టీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో మిగతా ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ బిజీ అయ్యింది.