తెలంగాణలో ఈడీ, సీబీఐ దర్యాప్తులు కొనసాగుతున్నాయి. మొన్న ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించగా..ఇవాళ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ఆరు గంటలసేపు ప్రశ్నించిన అనంతరం రేపు మరోసారి విచారణకు రమ్మని సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనీ లాండరింగ్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపి..ఇవాళ ప్రశ్నించింది. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో మద్యాహ్నం 3 గంటల్నించి రాత్రి 9 గంటల వరకూ విచారణ కొనసాగింది. మంగళవారం అంటే రేపు మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు సూచించారు. ఈడీ విచారణ అనంతరం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన వ్యక్తిగత, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారని రోహిత్ రెడ్డి తెలిపారు. తన వ్యాపార వివరాలు కూడా ఆడిగారన్నారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబిచ్చానన్నారు. అయినా తనను ఏ కేసులో పిలుస్తున్నారో ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదన్నారు. అయితే దర్యాప్తు సంస్థలపై తనకు నమ్మకముందని..మరోసారి విచారణకు వస్తానని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. 


వాస్తవానికి తాను అయ్యప్ప దీక్షలో ఉండటంతో నోటీసులో కోరిన సమాచారం ఇచ్చేందుకు వారం రోజుల వ్యవధి కావాలంటూ పీఏ శ్రవణ్ ద్వారా రోహిత్ రెడ్డి ఈడీ అధికారులకు లేఖ పంపించారు. ఈ విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించడంతో విచారణకు హాజరయ్యారు రోహిత్ రెడ్డి. 


Also read: Dammaiguda Girl Death: చిన్నారి ఇందు మృతి కేసులో వీడిన మిస్టరీ.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో క్లియర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook