Dammaiguda Girl Death: చిన్నారి ఇందు మృతి కేసులో వీడిన మిస్టరీ.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో క్లియర్

Dammaiguda Girl Death Case Update: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన చిన్నారి ఇందు మృతి కేసులో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు మిస్టరీ ఛేదించారు. అన్ని వివరాలను వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2022, 01:29 PM IST
Dammaiguda Girl Death: చిన్నారి ఇందు మృతి కేసులో వీడిన మిస్టరీ.. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో క్లియర్

Dammaiguda Girl Death Case Update: మేడ్చల్‌ జిల్లా నాగారం పరిధిలోని దమ్మాయిగూడలో చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ వీడింది. ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా పోలీసులు గుర్తించారు. టాయిలెట్‌ కోసం చిన్నారి చెరువు దగ్గరకు వెళ్లినట్లు తేల్చారు. ఆడుకోవడానికి వచ్చిన ఇందు ఎక్కడ సరైన ప్రదేశం లేక పోవడంతో టాయిలెట్ కోసం చెరువు దగ్గరకి వెళ్లగా.. కాలు జారిపడినట్లు అనుమానిస్తున్నారు. దీంతో చిన్నారి ఊపిరితిత్తుల్లోకి చెరువు నీరు చేరింది. పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో వైద్యులు క్లియర్‌గా వెల్లడించారు. 

చిన్నారి ఇందు మృతి తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని దమ్మాయిగూడలోని అంబేడ్కర్‌ నగర్‌ చెరువులో విగత జీవిగా కనిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. బాలిక మృతదేహం వెలికితీసి అనంతరం పోస్ట్ మార్టంకు తరలించగా.. అదేసమయంలో కొన్ని పాత వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో ఓ చిన్నారి శరీరంపై తీవ్రగాయాలు ఉన్నాయి. వాటిని చూసి అందరూ ఇందు శరీరంపై గాయాలు ఉన్నాయని.. హత్యనేనని అనుమానించారు. చెరువు చుట్టుపక్కల గంజాయి ఎక్కువగా తాగుతున్నారని స్థానికులు ఆరోపించడంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

అయితే ఆ వీడియోలు చిన్నారి ఇందుకు సంబంధించినవి కాదని తేలింది. ఇందు శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వైద్యులు తేల్చారు. ఇందు మృతిపై ఎలాంటి అనుమానాలు వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. ఇందు ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించినట్లు తేల్చారు. 

దమ్మాయిగూడ జవహర్ నగర్‌కు చెందిన నరేశ్ దంపతుల చిన్న కుమార్తె ఇందు ఈ నెల 15వ తేదీన స్కూలుకు వెళ్లింది. క్లాస్ మొదలయ్యే ముందు బ్యాగ్ లోపలపెట్టి బయటకు వచ్చింది. పక్కనే ఉన్న పార్కు వద్ద ఆడుకునేందుకు వెళ్దామని చెప్పగా.. స్నేహితులు రామని చెప్పారు. దీంతో ఒంటరిగానే వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయింది. అటెండెన్స్ తీసుకునే సమయంలో ఇందు కనిపించకపోవడంతో టీచర్లు, విద్యార్థులు అంతా వెతికారు. చిన్నారి కనిపించకపోవడంతో వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆ డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. 10 బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టిన పోలీసులు.. అనేక కోణాల్లో ఆరా తీశారు. తల్లిదండ్రుల ఫోన్లు తీసుకుని చెక్ చేశారు. చుట్టుపక్కల గంజాయ బ్యాచ్‌ను విచారించారు. చివరకు పోస్ట్ మార్గం రిపోర్టులో ప్రమాదవశాత్తూ మరణించిన వైద్యులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read: Bilawal Bhutto Zardari: బిలావల్ భుట్టో తలను తీసుకొచ్చిన వ్యక్తికి రూ.2 కోట్ల రివార్డు.. బీజేపీ నేత ఆఫర్

Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 నుంచి నాగ్ అవుట్.. ఆ ఇద్దరి హీరోలలో ఒకరు ఫిక్స్?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News