TS TET Results Released: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల కావడంతో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  టీచర్ రిక్రూట్ మెంట్ కు టెట్ అర్హత కంపల్సరి. అందుకోసమే దాదాపు ఐదేళ్ల తర్వాత టెట్ నిర్వహించింది ప్రభుత్వం.  ఇప్పటికే జిల్లాల వారీగా ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించింది ప్రభుత్వం. అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఐదేళ్లుగా టీచర్ రిక్రూట్ మెంట్ జరగలేదు. దీంతో లక్షలాది మంది ఉపాధ్యాయ నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాద్యాయ పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ప్రకారం గురుకులాలకు సంబంధించి 12,438 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో  12,005 టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఉన్నత విద్యా శాఖలో 1,678 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


పాఠశాల విద్యాశాఖలో గుర్తించిన ఖాళీలు..


స్కూల్‌ అసిస్టెంట్స్‌ – 1,950 పోస్టులు


సెకండ్‌ గ్రేడ్‌ టీచర్స్‌ – 5415 పోస్టులు


లాంగ్వేజీ పండిట్స్‌ – 1,011 పోస్టులు


ప్రీఈటీ  – 416 పోస్టులు


మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌ – 88 పోస్టులు


పీజీటీ – 477 పోస్టులు


టీజీటీ – 985 పోస్టులు


ఇక తెలంగాణ టెట్ ఫలితాలు శుక్రావరం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను https://tstet.cgg.gov.in/వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఆ వెబ్ సైట్ ను సందర్శించి ఫలితాలు తెలుసుకోవచ్చు. నిజానికి టెట్ ఫలితాలు జూన్ 27నే రావాల్సి ఉంది. టెట్ 2022 నోటిఫికేషన్ లో ప్రభుత్వం ఈ విషయం వెల్లడించింది. కాని సమయానికి ఫలితాలు ఇవ్వలేదు. నాలుగు రోజులు ఆలస్యంగా టెట్ ఫలితాలు విడుదలయ్యాయి.  జూన్ 12న టెట్ పరీక్ష జరిగింది. పేపర్-1కు 3 లక్షల 18 వేల 506 మంది.. పేపర్-2కి 2 లక్షల 51 వేల 70 మంది హాజరయ్యారు. జూన్ 15న టెట్ ప్రాథమిక కీ వచ్చింది. దానిపై అభ్యర్థుల నుంచి వేల సంఖ్యలో అభ్యంతరాలు వచ్చాయి. పేపర్-1పై 7 వేల 930.. పేపర్-2పై 4 వేల 663 అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం జూన్ 29న ఫైనల్ కీ విడుదల చేశారు టెట్ కన్వీనర్ రాధా రెడ్డి. ఫైనల్  కీలో రెండు పేపర్లలో 13 ప్రశ్నలకు మార్పులు చేశారు.


Read also; TS TET  Results 2022: తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాలు విడుదల.. అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి..


Read also; TRS VS BJP: ప్రధాని మోడీ ముందు టీఆర్ఎస్ బలప్రదర్శన.. హైదరాబాద్ లో ఏం జరగబోతోంది?    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి