Teenmar Mallanna Exclusive Interview: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నికల్లో ఇప్పటివరకు ఆయన్ను గెలుపు వరించకపోయినా.. పోటీచేసిన ప్రతీసారి తన స్థాయిని, ప్రజాధరణను పెంచుకుంటూపోతున్న నేత. ఏ పార్టీలో ఉన్నా.. లేకున్నా.. ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసమే కొట్లాడతా అని గొంతెత్తి నినదిస్తున్న తీన్మార్ మల్లన్న మరోసారి తెలంగాణ రాజకీయాల్లో సెంటరాఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచారు. తెలంగాణ సర్కారుని ఎండగట్టడంలో తీన్మార్ మల్లన్నది ఓ ప్రత్యేకమైన శైలి. ఆ స్పెషాలిటీతోనే ప్రజల్లోకి వెళ్లారు.. సీఎం కేసీఆర్‌ని విమర్శించే వారికి దగ్గరయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా సీఎం కేసీఆర్‌ని విమర్శించే వారిలో ఎప్పుడూ ముందుండే తీన్మార్ మల్లన్న ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన్ను అభిమానించే వారిని ఆలోచనలో పడేశాయి. ఆయన్ని మొదటి నుంచీ గమనిస్తున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మల్లన్న వైఖరిలో మార్పు వచ్చిందా అనే సందేహాలకు కారణమయ్యాయి. సీఎం కేసీఆర్‌పై, తెలంగాణ సర్కారుని విమర్శించడంలో ఎప్పుడూ ముందే తీన్మార్ మల్లన్న ఉన్నట్టుండి మెత్తబడ్డారా ? తాను మొదటి నుంచీ లక్ష్యంగా చేసుకున్న నాయకుడిని బాతాల పోశెట్టి అని సంభోదిస్తూ తీవ్ర విమర్శలు చేసి అందరి కంట్లో పడిన ఆయన ఉన్నట్టుండి ఇక తిట్టను అని అనడానికి కారణమేంటి ? టీఆర్ఎస్ గెలుపుపై మల్లన్న పరోక్ష వ్యాఖ్యల సారాంశమేంటి ? 



ఢిల్లీ వెళ్లి మరీ జాతీయ స్థాయి నాయకత్వం సమక్షంలో బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ఇక బీజేపీ ఆఫీసు వైపు వెళ్లననడానికి వెనుకున్న కారణమేంటి ? బీజేపీలోకి వెళ్లిన కొద్దికాలంలోనే ఆయన ఆ మాట అనాల్సిన అవసరం, పరిస్థితి ఏమొచ్చింది ? అసలు తీన్మార్ మల్లన్న అంతిమ లక్ష్యం ఏంటి ? ఆయన రాజకీయ పయణమెటువైపు వెళ్తోంది ? ఆయన మనసులో ఏముంది ? ఇప్పుడు చాలా మంది మెదళ్లను తొలిచేస్తోన్న అంతుచిక్కని ప్రశ్నలివి. తీన్మార్ మల్లన్న గురించి చాలా మందికి కలుగుతున్న సవాలక్ష యక్ష ప్రశ్నలకు అదే పౌర సమాజం తరపున ఆయన్నుంచే సమాధానాలు రాబట్టే ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్. తీన్మార్ మల్లన్నతో (Teenmar Mallanna Latest News) లైవ్ డిబేట్‌లో అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు అంతే ఆసక్తికరమైన సమాధానాలు రానున్నాయి. అవేంటో తెలియాలంటే.. తప్పకచూడండి జీ తెలుగు న్యూస్‌లో మే 12న, గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఎక్స్‌క్లూజీవ్ లైవ్ షో... బిగ్ డిబేట్ విత్ భరత్.


Also read : Teenmar Mallanna: బీజేపీ ఆఫీస్‌లో అడుగుపెట్టేది లేదు..కమలానికి తీన్మార్ మల్లన్న బైబై..?


Also read : Attack on Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై కత్తితో దాడి.. ఇది టీఆర్ఎస్ గూండాల పనే అంటున్న మల్లన్న


Also read : Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook