Attack on Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై కత్తితో దాడి.. ఇది టీఆర్ఎస్ గూండాల పనే అంటున్న మల్లన్న

Attack on Teenmar Mallanna at Shanarthi Telangana office: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై శుక్రవారం రాత్రి దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన దుండగులు.. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌ను బూతులు (Boothulu) తిడుతూ దాడికి పాల్పడ్డారు. తనపై దాడి జరిగిన అనంతరం ఆ వివరాలు మీడియాకు వెల్లడించిన తీన్మార్ మల్లన్న.. కత్తితో దుండగులు జరిపిన దాడిలో తన చేతికి గాయమైందని (Teenmar Mallanna injured in attack) అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 09:19 AM IST
  • శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన దుండగులు
  • తీన్మార్ మల్లన్నను అసభ్యపదజాలంతో (Abuse) దూషిస్తూ దాడి
  • మారణాయుధాలు తీసుకొచ్చి హత్యాయత్నానికి (Murder attempt on Teenmar Mallanna) పాల్పడ్డారని ఆరోపించిన తీన్మార్ మల్లన్న
Attack on Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నపై కత్తితో దాడి.. ఇది టీఆర్ఎస్ గూండాల పనే అంటున్న మల్లన్న

Attack on Teenmar Mallanna at Shanarthi Telangana office: ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నపై శుక్రవారం రాత్రి కొద్దిసేపటి క్రితం దాడి జరిగింది. హైదరాబాద్ మేడిపల్లిలోని శనార్థి తెలంగాణ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చిన దుండగులు.. తీన్మార్ మల్లన్నను (అసలు పేరు చింతపండు నవీన్‌) బూతులు (Boothulu) తిడుతూ దాడికి పాల్పడ్డారు. తనపై దాడి జరిగిన అనంతరం ఆ వివరాలు మీడియాకు వెల్లడించిన తీన్మార్ మల్లన్న.. కత్తితో దుండగులు జరిపిన దాడిలో తన చేతికి గాయమైందని (Teenmar Mallanna injured in attack) అన్నారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తోటి సిబ్బందిపైనా దుండగులు దాడికి దిగారు. అడ్డు వచ్చిన వారిని అసభ్యపదజాలంతో దూషించారు. శనార్థి తెలంగాణ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్స్, టీవీలు, ఫర్నిచర్‌ని సైతం ధ్వంసం చేశారు. దుండగుల దాడికి సంబంధించిన వీడియోను (Teenmar Mallanna attack visuals) తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీడియాకు విడుదల చేసిన తీన్మార్ మల్లన్న.. ఇది కచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గూండాల పనే అని ఆరోపించారు. 

శనార్థి కార్యాలయంపై దుండగులు దాడికి పాల్పడుతున్నారని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఇకనైనా మేడిపల్లి పోలీసులు స్పందించి తనపై దాడికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకుని చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna attacked by goons)  డిమాండ్ చేశారు. 

అమెరికాలో ఉన్న ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు ఈ పని చేయించారని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna slams Minister KTR) ఆరోపించారు. 20 మంది టీఆర్ఎస్ పార్టీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని తీన్మార్ మల్లన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తన పత్రికలో నిజాలను రాసిన నేపథ్యంలో అది జీర్ణించుకోలేకే ఈ అరాచకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. వచ్చిన వారిని దుండగులుగా భావించలేదని.. ఎవరో తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చి ఉంటారని వారికి కుర్చీలు వేసేందుకు తాము ప్రయత్నిస్తుండగానే వారు దాడికి పాల్పడ్డారని తీన్మార్ మల్లన్న (Attack on Teenmar Mallanna) జరిగిన ఉదంతాన్ని వివరించారు.

Also read : Teenmar Mallanna joins BJP : బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. సీఎం కేసీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

మేడిపల్లి పోలీసులు నిజంగా ప్రజల పక్షమే ఉన్నట్టయితే 24 గంటల్లో దుండగులను అరెస్ట్ చేసి చూపించాలని తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీసులకు సవాల్ విసిరారు. తమను కేటీఆర్ పంపించారని.. తాము కేటీఆర్ మనుషులం అని దుండగులే స్వయంగా చెప్పారని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna complaints against Minister KTR) మేడిపల్లి ఎస్సైకి ఘటనా స్థలంలోనే ఫిర్యాదు చేశారు. తీన్మార్ మల్లన్న మౌఖిక ఫిర్యాదుపై స్పందించిన మేడిపల్లి ఎస్సై.. రాతపూర్వకంగా ఫిర్యాదు అందిస్తే కేసు దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకుంటామని మల్లన్నకు (Teenmar Mallanna latest news) తెలిపారు.

పాత్రికేయుడిగా ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తోన్న తీన్మార్ మల్లన్న ఇటీవలే బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందుగా జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మను (Astrologer Laxmikant Sharma) బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించారనే కేసులో అరెస్ట్ అయిన ఆయన బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులోనూ ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna)  తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్ష్మీకాంత్ శర్మ అనుచరులు తనతో ఫోన్‌లో జరిపిన బేరసారాలకు సంబంధించిన ఆడియో టేప్స్ సైతం ఆయనకు బయటకి విడుదల చేశారు. వారు డబ్బులు ఇచ్చి లక్ష్మీకాంత్ శర్మపై కథనాలు ఆపించేందుకు ప్రయత్నించినప్పటికీ.. తాను అందుకు లొంగలేదని, అందుకే ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారని తీన్మార్ మల్లన్న అప్పట్లోనే తన అరెస్ట్ ఘటనను తీవ్రంగా ఖండించారు.

Also read : Teenmar Mallanna : తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలపై జైలు అధికారి రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News