Teenmar Mallanna Joins BJP: ప్రముఖ జర్నలిస్టు, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) అలియాస్ చింతపండు నవీన్ కుమార్ మంగళవారం (డిసెంబర్ 7) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay), ఎంపీ ధర్మపురి అరవింద్ సమక్షంలో మల్లన్న పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్ మల్లన్నకు పార్టీ సభ్యత్వ రసీదు అందించారు. అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కేసీఆర్ (CM KCR) ముఖ్యమంత్రి అయ్యాక... ఆయన ప్రపంచంలోనే అత్యంత మోసకారి అని మొట్టమొదట చెప్పింది నేను. మీడియాను అణచివేసి వంద మీటర్ల లోతు పాతిపెడుతా అన్నప్పుడే... నిన్ను పాతిపెట్టే రోజు కూడా వస్తుందని ప్రశ్నించాను. నేను ప్రశ్నించే నాడు ఒక్కడినే. ఇవాళ లక్షలాది గొంతులు ప్రశ్నిస్తున్నాయంటే మావంతు ప్రయత్నం చేయడం వల్లే. ప్రశ్నించడమే కాదు... ఇప్పుడే పనిచేసే దశ... అందుకే బీజేపీలో చేరాను. అమరవీరుల కుటుంబాలతో తెలంగాణ ప్రభుత్వానికి బుద్ది చెప్పిస్తా.' అని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) పేర్కొన్నారు.


తనపై 38 కేసులు పెట్టి సాధించినదేంటని తీన్మార్ మల్లన్న (Teenmar Mallanna) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 'నాపై కేసులు పెడితే పోలీసులే కన్నీళ్లు పెట్టుకున్నారు... జడ్జిలు మదనపడ్డారు... కానీ మా చేతిలో అధికారం ఉందనే అహంకారంతో మీరు ముందుకెళ్లారు. హుజురాబాద్‌లో మీ వీపు మీరే పగలగొట్టుకున్నారు. నువ్వు ఏ ఐదెకరాల వద్ద ప్రారంభమయ్యావో మళ్లీ అక్కడికే తీసుకొస్తాం. బీజేపీతో మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దక్కింది. బరాబర్ నీ సంగతి చెప్తాం. తీన్మార్ మల్లన్నపై కేసులు పెట్టినందుకు కోపం కాదు... నువ్వు జర్నలిజం కుత్తుక మీద కత్తి పెట్టినవ్... ఉద్యమకారులను తొక్కే ప్రయత్నం చేశావు. అందుకే ఇవాళ ఉద్యమకారులంతా ఒక్కటవుతున్నారు. మై హోమ్ సిమెంట్‌తో నీకు రాజకీయ సమాధి కడుతాం.' అని తీన్మార్ మల్లన్న సీఎం కేసీఆర్‌ను హెచ్చరించారు.


తెలంగాణ బీజేపీలో (Telangana BJP) వరుస చేరికలు ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్న ఆ పార్టీ... ఆ దిశగా పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ అసంతృప్త నేతలను పార్టీ వైపు ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు చింతలగట్టు విఠల్ సోమవారం (డిసెంబర్ 6) బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. మున్ముందు మరింత మంది బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.


 


 



Also Read: ఈ ఫొటోలో ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook