Big Debate With Bharath: పీకే సర్వే రిపోర్ట్ లీక్ చేసిన తీన్మార్ మల్లన్న.. టీఆర్‌ఎస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో తెలుసా ?
Teenmar Mallanna Exclusive Interview: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తీన్మార్ మల్లన్న జీ తెలుగు న్యూస్ స్టూడియోలో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్‌ను లీక్ చేశారు. ఆ సర్వేలో తేలిన విషయాన్నే చెబుతున్నానని స్పష్టం చేశారు.
Teenmar Mallanna Exclusive Interview: సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న తీన్మార్ మల్లన్న జీ తెలుగు న్యూస్ స్టూడియోలో సంచలన విషయాలు వెల్లడించారు. ప్రశాంత్ కిషోర్ సర్వే రిపోర్ట్‌ను లీక్ చేశారు. ఆ సర్వేలో తేలిన విషయాన్నే చెబుతున్నానని స్పష్టం చేశారు. మరి.. ఆ రిపోర్ట్ తనకెలా వచ్చిందంటే తనకుండే సోర్స్ తనకుందని, కచ్చితంగా అదే రిపోర్ట్ అని మల్లన్న స్పష్టం చేశారు.
ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ అస్సలు గెలవదన్నారు తీన్మార్ మల్లన్న. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే అదే సంఖ్యలో సీట్లు వస్తాయన్నారు. ఇది తాను చెప్పేది కాదని, పీకే సర్వే చేసిన రిపోర్ట్‌నే తాను చెబుతున్నానన్నారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా టీఆర్‌ఎస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్‌కు కేవలం 21 సీట్లు మాత్రమే వస్తాయన్నారు.
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్‌ఎస్ గెలుస్తుందని చెప్పారని, మరి.. ఆ వ్యాఖ్యలకు కారణమేంటని జీ తెలుగు న్యూస్ ఎడిటర్ భరత్ ప్రశ్నించారు. శత్రువుని బలంగా ఉన్నప్పుడు బలహీనంగా చేయాలని, బలహీనంగా ఉన్నప్పుడు బలంగా చేయాలని.. అదో కళ అని చెప్పారు. శత్రువు రెచ్చిపోతున్నాడంటే ఇంకా రెచ్చిపోయేలా చేయాలని, టీఆర్‌ఎస్ కార్యకర్తలు నా వాయిస్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేశానన్నారు. అది తన వ్యూహంలో భాగమన్నారు. తన వాయిస్‌ను టీఆర్‌ఎస్ కార్యకర్తలే వైరల్ చేసేలా చేశానన్నారు.