Revanth Reddy: తెలంగాణలో ఎస్సీవర్గీకరణ వివాదం రచ్చ రాజేస్తోంది. తాము అధికారంలోకి రాగానే వర్గీకరణను అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు తప్పేలాలేవు..ఎస్సీ వర్గీకరణపై అధికార పార్టీ నేతలు రెండు వర్గాలు విడిపోయినట్టు తెలుస్తోంది. ఒకరు వర్గీకరణ కావాలని డిమాండ్‌ చేస్తుంటే..మరికొందరు మాత్రం వర్గీకరణ వద్దని అంటున్నారని టాక్‌. ముఖ్యంగా మాల సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు వర్గీకరణను అడ్డుకుంటున్నారట. అయితే ఈ విషయం తెలుసుకుని మాదిగ సామాజికవర్గం నేతలు మాత్రం తెగ గుస్స అవుతున్నట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఇదే విషమమై రెండు వర్గాలు విడిపోయిన నేతలు ఎవరికి వారే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. తాజాగా నల్గొండలో మాదిగ సామాజికవర్గం నేతలు సమావేశమై ఎస్సీ వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అంతేకాదు పార్టీ తీర్మానించిన అంశాన్ని మాల సామాజికవర్గం అడ్డుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. అయితే సొంత పార్టీలోని నేతలు రెండు గ్రూపులు విడిపోవడం ఇప్పుడు రేవంత్ సర్కార్‌కు తెగ ఇబ్బందిగా మారిందట. అయితే పట్టుకుంటే పాముకు కోపం.. విడవమంటే కప్పకు ప్రకోపం అన్నట్టుగా నేతల తీరు తయారైందని వాదన వినిపిస్తోంది. అయితే ఈ విషయాన్నీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఎలా పరిష్కారిస్తారు అనేది మాత్రం హాట్‌టాపిక్‌గా మారింది.  


ఇక ఎస్సీ వర్గీకరణ అంశం ఇనాటిది కాదు.. వర్గీకరణ కోరుతూ చాలా మంది లీడర్లు పోరాటం చేస్తున్నారు. ఈ విషయాన్ని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే గ్రహించిన అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.. వర్గీకీరణ చేసి తీరుతామని ప్రకటించారు. తాము అధికారంలోకి రాగానే అవసరమైతే ప్రస్తుతం ఉన్న నోటిఫికేషన్లకు వర్తించేలా చేసి మాదిక సామాజికవర్గానికి చెందిన నేతలకు మేలు జరిగేలా చేస్తామని అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. కానీ ఇటీవల డీఎస్సీ ఉద్యోగాల విషయంలో వర్గీకరణ రిజర్వేషన్‌ను అమలు చేయలేదు. అయితే వర్గీకరణ అమలు చేసేందుకు ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అధ్యక్షతన ఓ కమిటీ సైతం వేసింది. తాజాగా మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి నివేదిక సైతం ఇచ్చింది. అయితే వర్గీకరణ అమలు కోసం రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ వేయాలని నిర్ణయించింది. ఈ కమిషన్‌ డిసెంబర్‌ 14వ తేదీలోపు సర్కార్‌కు నివేదిక అందజేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.


మొత్తంగా మాల సామాజికవర్గం నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ వర్గీకరణను అడ్డుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. అయితే ఈ మీటింగ్‌లపై మాదిగ సామాజికవర్గం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారట. వర్గీకరణకు పార్టీ హైకమాండ్ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే.. కట్టుబడి ఉండాల్సిన నేతలు ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. ఒకవేళ ఎస్సీవర్గీకరణను అడ్డుకుంటే మాత్రం పరిస్థితులు మరోలా ఉంటాయని హెచ్చరిస్తున్నారట.. మరోవైపు ఏదీఏమైనా వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయనీయబోమని మాల నేతలు సైతం సవాళ్లు విసురుతున్నట్టు తెలుస్తోంది.


Also Read: Smitha Sabharwal: స్మితా సబర్వాల్‌ గుడ్‌ బై!


Also Read: YS JAGAN: జంపింగ్‌లపై కొత్త అస్త్రం.. రాజన్న బాటలో జగనన్న!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.