YS JAGAN: జంపింగ్‌లపై కొత్త అస్త్రం.. రాజన్న బాటలో జగనన్న!

YS JAGAN: వైసీపీ అధినేత జగన్‌ రూట్‌ మార్చారా..! గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అమలు చేసిన విధానాన్నే ఫాలో కాబోతున్నారా..! వైసీపీ బలోపేతానికి ఇదే సరైనా నిర్ణయమని జగన్‌ డిసైడ్‌ అయ్యారా..! ఇంతకీ గతంలో రాజశేఖర్‌ రెడ్డి ఏ ఫార్ములాను అమలు చేశారు. ఇప్పుడా ఆ ఫార్ములా జగన్‌ విషయంలోనూ పనిచేస్తుందా..!

Written by - G Shekhar | Last Updated : Nov 27, 2024, 08:28 PM IST
YS JAGAN: జంపింగ్‌లపై కొత్త అస్త్రం.. రాజన్న బాటలో జగనన్న!

YS JAGAN: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ రూట్‌ మార్చినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పార్టీ నేతల జంపింగ్‌తో పరేషాన్‌ అయినా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. ఇప్పుడు జనంలోకి వెళ్లేందుకు డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. జనవరి 3వ వారంలో వైఎస్ జగన్ జనాల్లోకి రాబోతున్నట్టు సమాచారం. ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు సమీక్షలు నిర్వహించనున్న జగన్‌.. క్యాడర్‌కు పూర్తి భరోసా ఇస్తారని తెలుస్తోంది. మొత్తం 26 జిల్లాల్లో వైఎస్‌ జగన్ పర్యటన ఉండనున్నట్టు సమాచారం. అయితే జగన్ జిల్లాల టూర్‌పై సొంత పార్టీ లీడర్లు, క్యాడర్‌ సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికైనా జగన్‌ ఇంట్లో నుంచి బయటకు వచ్చినందుకు తెగ సంబుర పడిపోతున్నట్టు తెలుస్తోంది.

గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్‌ జగన్‌ ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల ఫోన్‌ ట్యాపింగ్‌ జరుగుతుందనే భయంతో పక్కా రాష్ట్రానికి మకాం మార్చారు. ఒకవేళ పార్టీ నేతలు సమావేశం కావాల్సి వస్తే వారిని బెంగళూరు పిలిపించుకుని దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయాక అనేక మంది లీడర్లు అధికార పార్టీలో చేరిపోయారు. పలువురు మాజీ మంత్రులు.. అప్పట్లో నిత్యం జగన్ చుట్టూ తిరిగిన మంత్రులు సైతం జగనన్నకు వదిలేసి అధికార పార్టీకి దగ్గరయ్యారు. అయితే నేతల జంపింగ్‌లపై ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న జగన్‌.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరింత నష్టం జరుగుతుందనే అంచనాకు వచ్చారట. అందుకే ఆయన నేరుగా మరోసారి జనంలోకి వెళ్లేందుకు డిసైడ్‌ అయినట్టు సమాచారం.

గతంలో 3 వేల  కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన జగన్‌.. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. అనంతరం ఐదేళ్లు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. కానీ ఐదేళ్లు గడవగానే జగన్ ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా జగన్‌ కూడా మారినట్టే కనిపిస్తోంది. ఇకమీదట వైసీపీ బలోపేతం కోసం సామాన్య కార్యకర్తలు నుంచి  సలహాలు, సూచనలు తీసుకోనునట్టు పార్టీ వర్గాలు అంటున్ఆనయి. అంతేకాదు తాడేపల్లిలోనూ తనను కలిసేందుకు వచ్చిన వారిని నేరుగా కలవనున్నారట.

మొత్తంగా గతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మాదిరిగా అపాయింట్‌మెంట్‌తో పనిలేకుండా నేతలను కలిసేందుకు డిసైడ్‌ అయినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జగన్ అనూహ్య నిర్ణయాలను చూసి సొంత పార్టీ లీడర్లే షాక్‌ అవుతున్నట్టు తెలిసింది. చూడాలి మరి జగన్ సంచలన నిర్ణయంతో వైసీపీకి కలిసివస్తుందా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి!

Also Read: Smitha Sabharwal: స్మితా సబర్వాల్‌ గుడ్‌ బై!

Also Read: Unstoppable Show: బాలయ్యతో జాతిరత్నం.. మధ్యలో 'కిస్సిక్' పిల్ల కలిస్తే రచ్చరచ్చే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News