Mahalakshmi Scheme: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పధకం ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. అసెంబ్లీ ప్రాంగణంలో మద్యాహ్నం 1.30 గంటలకు రేవంత్ రెడ్డి పధకాన్ని ప్రారంభించాక వెంటనే అంటే 2 గంటల్నించి ఉచిత ప్రయాణ పధకం అమల్లో రానుంది. ఈ పధకం మార్గదర్ఖకాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వంపై దీనివల్ల పడే అదనపు భారమెంత అనే వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది. ఇందులో కీలకమైంది కర్ణాటక తరహాలో ఇచ్చిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం పురస్కరించుకుని మద్యాహ్నె అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాల్ని ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. దీని ప్రకారం హైదరాబాద్ సిటీలో ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ, రాష్ట్రంలో అయితే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్ సర్వీసుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మహిళలు, బాలికలు, విద్యార్ధినులు, ట్రాన్స్‌జెండర్లకు ఈ పధకం వర్తిస్తుంది. కళాశాలలకు వెళ్లే విద్యార్ధినులకు ఇకపై బస్ పాస్ అవసరం లేదు. ఈ పధకం నుంచి డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ ఏసీ బస్సుల్ని మినహాయించారు. ముందస్తు రిజర్వేషన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 


ఆర్టీసీపై పడే భారం


తెలంగాణలో మొత్తం 7292 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుంది. ఈ పధకం ద్వారా ఆర్టీసీపై అదనంగా 3 వేల కోట్ల వరకూ ఆర్ధిక భారం పడనుందని అంచనా. టికెట్ల ఆధారంగా ఆర్టీసీకు ప్రయాణ ఛార్జీలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. రోజుకు ఆర్టీసీ బస్సుల ద్వారా 35-40 లక్షలమంది ప్రయాణాలు చేస్తుంటే ఆదాయం 14 కోట్లు వస్తోంది. ఇప్పుడీ ఉచిత పధకం కారణంగా ఆదాయం సగానికి పడిపోవచ్చు. 


మహాలక్ష్మీ పధకంలో భాగంగా మహిళల ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి త్వరలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు జారీ చేయనున్నారు. అంతవరకూ ఆధార్ లేదా ఏదైనా ఐడీను స్థానికత కోసం కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది. ఉచిత ప్రయాణానికి ఇతర పరిమితులు, నిబంధనల్లేవని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అంటే కిలోమీటర్ల పరిధి, ఎన్నిసార్లు వెళ్లవచ్చనే నిబందనల్లేవు. ఆర్టీసీ మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తుంది. తెలంగాణ సరిహద్దుల వరకే ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుంది. 


Also read: Telangana Assembly: ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ప్రోటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook