Rythu Bheema:తెలంగాణలో రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలవుతున్నాయి, ఈ రెండు పథకాలు సీఎం కేసీఆర్ మాసనపుత్రికలు. రైతు బంధు రైతకు ఎకరాకు ఏడాదికి పెట్టుబడి సాయం 10 వేల రూపాయలు అందిస్తుంది కేసీఆర్ సర్కార్. 2017 నుంచి ఈ పథకం అమలవుతుంది. ఈ స్కీం కోసం ఏకంగా 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. రైతు బీమా కూడా దేశ వ్యాప్తంగా ప్రసంశలు అందుకుంది. కేసీఆర్ సర్కార్ మంచి పేరు తీసుకువస్తోంది. రైతు బీమా కింద 60 ఏళ్ల లోపు ఉన్న రైతులందరికి బీమా చేయించింది తెలంగాణ సర్కార్. ఎవరైనా రైతు ఎలా చనిపోయినా.. అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనుంది. ఇందుకోసం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మక రైతు బీమా పథకంలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించింది కేసీఆర్ సర్కార్. రైతు బంధు సామూహిక జీవిత బీమా అప్లికేషన్లలో మార్పులకు అవకాశం ఇచ్చింది. 2022-23 సంవత్సరానికి గాను రైతు బీమా పథకంఅమలుకు భారతీయ బీమా సంస్థకు ప్రిమీయం చెల్లింపులు చేస్తుంది కేసీఆర్ సర్కార్. ఈ క్రమంలో అర్హులైన అన్నదాతలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం మరో చాన్స్ ఇచ్చింది. కొత్త అప్లికేషన్లు తీసుకోవడంతో పాటు గతంలో రైతుబీమాలో నమోదు చేసుకున్న రైతులు తమ వివరాల్ల ోఏమైనా తప్పుగా ఉన్నట్లైతే మార్పులు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.  గతంలో దరఖాస్తులో పొందుపరిచిన నామిని చనిపోతే ఆ స్థానంలో మరో పేరు చేర్చడం, అప్లికేషన్లలో ఎవైనా తప్పులుటే వాటిని సరి చేసుకునే అవకాశం కల్పించింది.


రైతు  బీమాలో మార్పులు, చేర్పుల కోసం స్థానిక మండల వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి వివరాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది. ఇందుకోసం  ఈ నెల 20 బుధవారం లాస్ట్ డేట్. దీంతో రైతులను మరోసారి అలర్ట్ చేసింది.  సంబంధిత దరఖాస్తు పూర్తి చేసి.. కావాల్సిన డాక్యుమెంట్స్ జత చేసి సాఫ్ట్‌వేర్‌లో సరిచేసుకోవాలని పేర్కొంది. అన్నింటికీ ఆధార్ కార్డు ప్రామాణికం కావడంతో ఆధార్ ద్వారానే ఈ అవకాశం కల్పించింది. రైతు పేరు, తండ్రి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబరు, గ్రామం, మండలం, జిల్లా, పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ వంటి అన్ని వివరాలను తప్పనిసరి. వీటిలో ఏది తప్పుగా ఉన్నా తిరిగి నమోదు చేసుకోవచ్చు. పట్టాదార్ పాస్తు పుస్తకం ఉన్న యువతి పెళ్లైతే..  ఆధార్‌ కార్డులో తన ఇంటి పేరు మార్చుకుంటే.. రైతు బీమాలోనూ మార్పు చేసుకోవచ్చు. రైతులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచిస్తోంది తెలంగాణ వ్యవసాయ శాఖ.


Also Read: Drones in Agriculture: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం... త్వరలో రైతులకు డ్రోన్లు..  


Also Read: Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..   



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook