Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..

Horoscope Today July 20th 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇవాళ మేష, సింహ రాశి వారిని అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కర్కాటక, కన్య, తులా రాశుల వారికి కలిసొస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 06:30 AM IST
  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఇవాళ మేష, సింహ రాశి వారికి అనారోగ్య సమస్యలు
  • కర్కాటక, కన్య, తులా రాశుల వారికి కలిసొస్తుంది
  • ఇంకా ఏయే రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఎదురువుతాయంటే..
Horoscope Today July 20th: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు..

Horoscope Today July 20th 2022: ఇవాళ బుధవారం. హిందువులు శ్రీకృష్ణుడిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో విష్ణువును కూడా పూజిస్తారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం బుధవారానికి బుధుడు అధిపతి. బుధ సంచార ప్రభావం ఇవాళ అన్ని రాశులపై ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారి జాతక ఫలం ఇవాళ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)

ఇవాళ ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆ కారణంగా మీలో సహనం నశిస్తుంది. షార్ట్ టెంపర్‌గా ఉండటం మీకే నష్టమని గుర్తించండి. కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరమైన వాటికి ఖర్చు చేస్తారు. ప్రేమికులు అనవసర విషయాలపై చర్చించి తగువులాడవద్దు. అది బ్రేకప్ దాకా వెళ్లిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

వృషభ రాశి (Taurus)

ఇవాళ ఓ ప్రభావశీలురైన వ్యక్తిని కలుస్తారు. అతను లేదా ఆమె పరిచయం మీ ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకొస్తుంది. ఆ వ్యక్తి సలహాలు మీ పురోగతికి దోహదపడుతాయి. వ్యాపారంలో కొత్త ప్రణాళికలకు అది దారితీస్తుంది. బిజినెస్‌లో మరింత పెట్టుబడి పెడుతారు. సమీప భవిష్యత్తులో దాని ద్వారా లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.

మిథున రాశి (GEMINI)

తల్లి ఆరోగ్యం నయమవుతుంది. చేపట్టిన ప్రతీ పనిని ఆస్వాదిస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సామాజికంగా మీ పట్ల గౌరవం పెరుగుతుంది. పని భారం కారణంగా మానసికంగా అలసిపోతారు. అదే కారణంతో ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా వెళ్లలేకపోతారు. ప్రస్తుతం కొనసాగుతున్న పనిని వీడి కొత్త పనిలో చేరే ఆలోచనలో ఉంటారు.

కర్కాటక రాశి (Cancer) 

చేపట్టిన పనిలో సంతృప్తి లభిస్తుంది. వృత్తి రీత్యా ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. మీ గురువులు మీకు సరైన మార్గాన్ని చూపుతారు. అది మీ లక్ష్యం విషయంలో మీకు స్పష్టతనిస్తుంది. ఆత్మన్యూనతా భావం తొలగిపోయి ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.

సింహ రాశి (LEO)

ఇవాళ నిరాశలో ఉంటారు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు ప్రతికూల సమయం. కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాలనుకునేవారు ప్రస్తుతానికి ఆ ఆలోచనను విరమించుకోవడం ఉత్తమం. లేనిపక్షంలో నష్టాల్లో చిక్కుకుపోతారు. ఇదివరకు మీరు సంపాదించినదంతా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచీ తూచీ వ్యవహరించాలి.

కన్య రాశి (Virgo)

ఇవాళ సంతృప్తికరంగా ఉంటుంది.కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. అందుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు చేపడుతారు. వారసత్వ ఆస్తికి సంబంధించిన తగాదాలు పరిష్కారమవుతాయి. మునుపటికన్నా జీవితం మరింత ఆశాజనకంగా సాగుతుంది.

తులా రాశి (Libra)

ఇవాళంతా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ దృష్టి మొత్తం లక్ష్యం వైపే ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో శుభవార్త వింటారు. ప్రస్తుతానికి మీ శత్రువులు లేదా ప్రత్యర్థులు మీ వైపు కన్నెత్తి చూడరు. మీ ఎదుగుదల మీ కుటుంబంలో కొత్త సంతోషం నింపుతుంది. ఏ రంగంలో ఉన్నా మీరు బాగా రాణిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.

వృశ్చిక రాశి (Scorpio)

మేదోపరమైన అంశాలకు ప్రాధాన్యతనిస్తారు. అధ్యయనం, నేర్చుకోవడం మీకు చాలా ఇష్టమైన విషయాలు. మీ మేదస్సు మిమ్మల్ని ప్రతిభావంతుడిగా మారుస్తుంది. సమాజం మిమ్మల్ని మేదావిగా గుర్తిస్తుంది. మేదోపరమైన చర్చల్లో మీకు తిరుగుండదు. అయితే ఆర్థిక విషయాల్లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ప్రియురాలు లేదా ప్రియుడి కోసం కొంత డబ్బు ఖర్చు చస్తారు. 

ధనుస్సు రాశి (Sagittarius)  

ఇవాళంతా నిరాశపూరితంగా గడుస్తుంది. అప్పగించిన బాధ్యతలను నెరవేర్చలేకపోతారు. మనసు కకావికలం అవుతుంది. మొత్తంగా గందరగోళ పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ధ్యానం ద్వారా మీ మనసు కొంత కుదుటపడే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రస్తుతం మీరున్న చోటు నుంచి మారాలని భావిస్తే.. కొంతకాలం ఆ ఆలోచన విరమించుకోవడం మంచిది.

మకర రాశి (Capricorn) 

ఇవాళంతా పాజిటివిటీతో ఉంటారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. చేపట్టిన పనిపై ఏకాగ్రత ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం మీపట్ల నమ్మకాన్ని పెంచుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఆర్డర్స్ వెతుక్కుంటూ వస్తాయి. మీ పేరు వ్యాపార వర్గాల్లో మారుమోగుతుంది. తద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇతరులకు సాయం చేసేందుకు వెనుకాడరు.

కుంభ రాశి (Aquarius)

కుటుంబ విషయాల్లో బిజీ బిజీగా గడుపుతారు. ఇంటికి అవసరమైన వస్తువుల కొనుగోలుకు డబ్బును వెచ్చిస్తారు. వృథా ఖర్చులు మానుకుంటే మంచిది. జీవిత భాగస్వామి కోరిక మేరకు బంగారం వంటి వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు గర్వంగా, అహంకారపూరితంగా మాట్లాడొద్దు. ఎదుటివారు మీకు శాపనార్థాలు పెట్టే అవకాశం ఉంటుంది.

మీన రాశి (Pisces) 

గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడుతారు. మీ తండ్రి అప్పగించిన వ్యాపార బాధ్యతల్లో క్టిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. అయితే సరైన నిర్ణయాలతో మీరు ఆ పరిస్థితులను అధిగమిస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు వెనుకాడరు. తద్వారా సమాజంలో మీకు మంచి పేరు వస్తుంది. విద్యారంగంలో ఉన్నవారికి సత్ఫలితాలు ఉంటాయి.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: KTR on PM Modi: తెలంగాణలో సమాఖ్య స్ఫూర్తి ఇదేనా..ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఫైర్..!

Also Read: బ్రా లేకుండా ప్రియాంక చోప్రా.. శారీ ఉన్నా లేనట్టే! పిచ్చెక్కిస్తున్న హాట్ డాన్స్ వీడియో 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News