TRS MLAs Case: నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారన్న వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఖమ్మం జిల్లాకు చెందిన పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావుల పేర్లు ఈ వ్యవహారంలో పాపులర్ అయ్యాయి. ఈ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగ్గురు వ్యక్తులు భారీ మొత్తంలో డీల్ మాట్లాడే క్రమంలో సదరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారం మేరకే ఘటనా స్థలానికి చేరుకుని వారిని అరెస్ట్ చేసినట్టు బుధవారం రాత్రి సైబరాబాద్ స్టీఫెన్ రవీంద్ర మీడియా ఎదుట చెప్పిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలాఉండగా తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన రామచంద్ర భారతి, నందకుమార్, సింహాచల రిమాండ్ చేయడాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తప్పుపట్టారు. ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారనడానికి సరైన ఆధారాలు లేనందున ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ పీసీ యాక్ట్ ఈకేసులో వర్తించదని ఏసీబీ న్యాయ స్థానం వ్యాఖ్యానించింది. 


లంచం ఇచ్చినట్టుగానూ ఎమౌంట్ లేకపోవటంతో ఆ ముగ్గురుని ఎలా రిమాండ్ చేస్తారని ఏసీబీ న్యాయమూర్తి ప్రశ్నించారు. ముగ్గురు అనుమానితుల అరెస్ట్ విధానాన్ని తప్పుపట్టిన ఏసీబీ కోర్టు.. వారిని తక్షణమే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది.  41crpc ప్రకారం నోటీస్ జారీ చేసి కేసు విచారణ జరపాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.


Also Read : TRS MLAs Trap Issue: ఆపరేషన్ ఆకర్ష్.. ఎఫ్ఐఆర్‌లో సంచలన విషయాలు


Also Read : BJP Deal With TRS MLAs: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంపై ధర్మపురి సెటైర్లే సెటైర్లు


Also Read : TRS MLAs Party change Deal: రోడ్డుపై బైఠాయించి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల, ఇంద్రకరణ్ రెడ్డి నిరసన


Also Read : TRS MLAs Deal Issue: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలన్న స్కెచ్ అందుకే: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి