Farmers Crop Loans Waiver News Updates : హైదరాబాద్ :  2018 ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఇచ్చిన రైతు రుణ మాఫీ అమలు హామీని తీరా 2023 ఎన్నికలు సమీపించే ముందు నిలబెట్టుకుంటాం అని అనడం పూర్తి రాజకీయమే అవుతుందని.. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడమే లక్ష్యంగా మరోసారి రైతు రుణమాఫీ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి నాటకం ఆడుతున్నారని ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రతిపక్షాల ఆరోపణలపై స్పందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే రుణమాఫీ ఆలస్యమయింది అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనావైరస్ వ్యాప్తి తరువాత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం లక్ష కోట్ల రూపాయల ఆదాయం నష్టపోయిందన్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కేంద్రం ఎఫ్‌ఆర్ బీఎం నిధులు విడుదల చేయకుండా తెలంగాణ పట్ల అనుసరించిన అలసత్వం, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన మందగమనం మూలంగా రుణమాఫీ కూడా ఆలస్యమయింది అని తెలిపారు. 


నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆటంకం కలగకూడదన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఏ కారణం చేత కూడా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో అడ్డంకులు ఎదురు అవకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇన్నిరోజులు రైతు రుణమాఫీ అంశాన్ని పక్కకుపెడుతూ వచ్చిందన్న నిరంజన్ రెడ్డి.. రైతులకు రుణమాఫీ ప్రక్రియ ఆలస్యం అవడానికి అసలు కారణం అదే అని అభిప్రాయపడ్డారు. 


ఇది కూడా చదవండి : Telangana Farmers Loan Waiver: రైతుల రుణ మాఫీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్


రైతుల సంక్షేమం విషయానికొస్తే.. కరోనావైరస్ మహమ్మారి వంటి విపత్తులోనూ రైతులకు ఇబ్బంది కలగకుండా రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని, రైతుల రుణమాఫీ విషయంలో రైతులను మభ్యపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించినప్పటికీ.. రైతుల కోసం ఇన్ని చేసిన కేసీఆరే రుణమాఫీ కూడా చేస్తాడని భావనలో ఉన్నారని అన్నారు. విపక్షాల మాటలను రైతులు విశ్వసించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి, రైతులకే తొలి ప్రాధాన్యం అన్న దానికి కేసీఆర్ పరిపాలనే నిదర్శనం అని నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రైతుల రుణమాఫీకి ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి రైతుబిడ్డగా, రైతుల మంత్రిగా రైతుల పక్షాన ధన్యావాదాలు చెబుతున్నానని అన్నారు. ఈ మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.


ఇది కూడా చదవండి : CM KCR Decision on Rythu Runa Mafi 2023: రైతు రుణ మాఫీపై కేసీఆర్ కీలక నిర్ణయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి