Mahesh kumar goud as Telangana pcc new president: కాంగ్రెస్ హైకమాండ్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  కొన్నినెలలుగా తెలంగాణలో పీసీసీ అధ్యక్షుడిపదవీ అనేది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై అనేక మంది ఢిల్లీ లెవల్ లో తమదైన పైరవీలు చేసినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే అనేక ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. గతంలో అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లు కూడా.. అధ్యక్షుడిరేసుల్లో విన్పించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతే కాకుండా.. దీనిపై ఇప్పటికే సీఎం కూడా చాలా సార్లు ఢిల్లీకి కూడా వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ తో కూడా పలు మార్లు చర్చించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో తాజాగా, ఏఐసీసీ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి.. కేసీ వేణు గోపాల్.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తున్నట్లు కూడా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ వర్గాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


మరోవైపు.. పీసీసీ చీఫ్ పదవీ కోసం.. గతంలో.. మధుయాష్కీ  గౌడ్, ధర్మపూరీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,  మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కూడా పోటీ పడినట్లు తెలుస్తోంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్ కు.. సీఎం రేవంత్ తో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో.. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపికలో తనదైన మార్కు చూపించారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది.  


రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా పాలన పగ్గాలు తీసుకున్నప్పటి నుంచి పాలనతో తనదైన మార్కుతో ముందుకు వెళ్లిపోతున్నారు. ఒకవైపు ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటునే..  మరోవైపు.. గత బీఆర్ఎస్ హాయాంలో జరిగిన అక్రమాలను సైతం ప్రజల ముందుంచుతున్నారు.


Read more: Ujjaini: ఉజ్జయిని శక్తిపీఠంలో ఘోరం.. నడి రోడ్డు మీద మహిళపై అత్యాచారం.. షాకింగ్ వీడియో వైరల్..  


అంతే కాకుండా.. ఖమ్మంలో కూడా వరదల బారిన పడ్డవారికి సహాయం అందజేస్తున్నారు. తెలంగాణలో వరదలకు ఖమ్మం పూర్తిగా అల్లకల్లోలంగా మారిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన కూడా ప్రజల ఇళ్లలోకి భారీగా వరద నీళ్లు వచ్చిచేరాయి. ఒకవైపు అధికారులు కూడా రంగంలోకి దిగి.. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో కేంద్రం కూడా తన వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు వదరల నేపథ్యంలో.. 3300 కోట్లను సహాయంగా ఇస్తున్నట్లు ప్రకటించింది.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.