Ujjaini: ఉజ్జయిని శక్తిపీఠంలో ఘోరం.. నడి రోడ్డు మీద మహిళపై అత్యాచారం.. షాకింగ్ వీడియో వైరల్..

Ujjaini woman raped video: పుణ్యక్షేత్రం అయిన ఉజ్జయినీలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 6, 2024, 05:06 PM IST
  • నడి రోడ్డు మీద మహిళపై అత్యాచారం..
  • దేశంలో ఆందోళన కరంగా మారిన ఘటన..
Ujjaini: ఉజ్జయిని శక్తిపీఠంలో ఘోరం.. నడి రోడ్డు మీద మహిళపై అత్యాచారం.. షాకింగ్ వీడియో వైరల్..

Ujjain road rape video viral: మహిళపై అత్యాచార ఘటనలు  ప్రస్తుతం దేశంలో తీవ్ర ఆందోళనలు కల్గించే అంశంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన కూడా.. మహిళలపై దాడులు  మాత్రం ఆగడం లేదు. కోల్ కతా ఘటన.. ఒక వైపు దేశంలో ప్రకంపనలు రేపుతుంది. మరోవైపున అత్యాచారాలు మాత్రం ఆగడంలేదు. ఆస్పత్రిలో.. నర్సుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా.. కోల్ కతాలో నిరసనలు తెలియజేస్తున్న ఒక యువతి మీద కూడా వేధింపులు జరిగాయి. నిర్భయ, అభయ, పోక్సో వంటి ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కూడా దాడులు మాత్రం ఆగడంలేదు.

Add Zee News as a Preferred Source

 

ప్రతిరోజు యువతులు, అమ్మాయిలపై దాడులు మాత్రం ఆగడంలేదు. కామాంధులు..  పసిపాప నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఏ ఒక్కర్ని కూడా వదలడం లేదు. చివరకు కొన్ని చోట్ల కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రులు, సోదరులు కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఉజ్జయినీలో నడిరోడ్డు మీద ఒక మహిళ అత్యాచారానికి గురైంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

పవిత్ర ప్రదేశం ఉజ్జయినీలో.. దారుణం చోటు చేసుకుంది. ఒక మహిళలను కామాంధుడు నడి రోడ్డు మీద, మహిళలను అత్యాచారం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రద్దీగా ఉన్న రోడ్డు మీద మహిళను అత్యాచారంకు పాల్పడ్డాడు. కోయిలా ఫాటక్ ప్రాంతంలో.. కామాంధుడు మద్యం మత్తులో రెచ్చిపోయాడు.

 

అంతేకాకుండా.. మహిళను రోడ్డు పక్కన బలవంతంగా ఈడ్చుకుని వెళ్లి తాగిస్తూ అత్యాచారంకు పాల్పడ్డాడు. అక్కడున్న వారు.. వీడియోలు తీసుకుంటూ ఉన్నారు.. కానీ ఏ ఒక్కరు మాత్రం ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం మధ్య ప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పై విమర్శలు చేస్తుంది. 

Read more: Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News