హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి వచ్చే కంపెనీలకు పూర్తి సహాకారం అందిస్తామని, నూతన పెట్టుబడులకు అవసరమైన మౌళిక వసతుల కల్పన చేపట్టాలని పరిశ్రమల శాఖాధికారులకు ఆదేశాలిచ్చామని ఐటీ శాఖామాత్యులు కేటీఆర్ తెలిపారు. పరిశ్రమలు, ఐటీ శాఖలపైన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సమీక్షలో మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో, ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమ విస్తరించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా త్వరలో టీవర్క్, రెండవ దశ టీహబ్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలోని ద్వీతీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమలు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నం ఫలితాలనిస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ నెల 18న కరీంనగర్ ఐటీ టవర్ ప్రారంభించనున్నామని, వరంగల్ లో పరిశ్రమల అభివృద్ది అవసరమైన మరిన్ని మౌళిక వసతులు ఏర్పాటు చేస్తామని అన్నారు. పుడ్ ప్రాసెసింగ్ రంగంలో త్వరలోనే పలు కంపెనీల పెట్టుబడుల ప్రకటనలు వెలువడనున్నాయని అన్నారు. 


ఈ సమావేశంలో పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పరిశ్రమ శాఖ కమీషనర్ మానిక్ రాజ్, టెక్స్ టైల్స్ డైరెక్టర్ శైలజా రామాయ్యర్, టియస్ ఐఐసి యండి వెంకట నర్సింహ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..