Telangana Governor Tamilisai Soundararajan Resigns: దేశంలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తమిళిసై.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో క్రియాశీలక ఎన్నికలలో పాల్గొంటారని సమాచారం. తమిళనాడులోని చెన్నై, తిరునల్వేలీ, కన్యాకుమారీలో ఏదో ఒక చోట ఆమె ఎన్నికల బరిలో దిగుతున్నట్లు తెలుస్తోంది. తమిళిసై సౌందరరాజన్ తెలంగాణ గవర్నర్ గా ,ఆమె 2019,సెప్టెంబర్ 8 న బాధ్యతలు స్వీకరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Snake Venom Rave Party: పాముల విషంతో రేవ్ పార్టీ.. బిగ్ బాస్ OTT 2 విన్నర్ అరెస్టు..


ఆ తర్వాత అప్పట్లో అధికారంలో ఉన్న  బీఆర్ఎస్ ప్రభుత్వానికి , గవర్నర్ కు మధ్య అనేక విషయాల్లో బేధాభిప్రాయాలు ఏర్పడి రచ్చగా మారింది. ఒకనాక సందర్భంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా మారింది. అప్పట్లో సీఎం గా ఉన్న కేసీఆర్ , గవర్నర్ తమిళిపై బహింరంగానే అనేక విమర్శలు చేశారు.


Read More: Viral Video: కజరారే పాటకు క్లాసులో లేడీ టీచర్ హాట్ స్టెప్పులు... వీడియో చూస్తే తట్టుకోలేరు..


మరోవైపు తమిళిసై కూడా తనదైన స్టైల్ లో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో గవర్నర్ గ కాకుండా.. పాలిటిక్స్ లో వెళ్లాలంటూ కూడా అప్పట్లో బీఆర్ఎస్ నాయకులు పలుమార్లు గవర్నర్ పై ఆరోపించారు.   ఈ క్రమంలో ఇటీవల సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇది దేశ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా... తమిళిసై.. 2009 లో చెన్నై నార్త్, 2019 లో తూత్తుకూడి నుంచి బీజేపీ తరపున అసెంబ్లీ బరిలో నిలిచిన కూడా గెలవలేకపోయారు. దీంతో 2019 లో తమిళిసై సేవలు గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ గవర్నర్ పదవిని కట్టబెట్టింది. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook