Telangana Assembly Election 2023: ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పార్టీలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. బీజేపీ తప్ప మిగతా రెండు పార్టీలు కాంగ్రెస్ మరియు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతున్నాయి. అటు కేసీఆర్.. ఇటు రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడు ఏర్పాటు సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోర్తాడులో జరుగుతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "ఇవి దొరల తెలంగాణకు - ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలు.. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోంది. శాండ్, ల్యాండ్, మైన్.. ఇలా ఏ దందాలో చూసినా  కేసీఆర్ కుటుంబం దోపిడే కనిపిస్తుంది. నేను అబద్ధపు వాగ్దానాలు చేయడానికి ఇక్కడకు రాలేదు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మాట ఇవ్వడానికి వచ్చా.. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించాము.. తెలంగాణలో అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 


రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. "మేము అధికారంలో వస్తే.. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల తెలంగాణ మహిళలకు రూ. 2500 అందిస్తాం.. అంతేకాకుండా.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం.. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు అనిస్తామని.. పసుపు రైతులకు క్వింటాకు రూ.12వేలు ధర కల్పిస్తాం మరియు గృహ జ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 


Also Read: Sreeleela : ఫైనల్ గా బాలకృష్ణ సహాయంతో.. తనంటే ఏంటో రుజువు చేసుకున్న శ్రీలీల..


మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్.. రాష్ట్రాలలో మేం ఎక్కడ బీజేపీతో యుద్ధం చేస్తే.. అక్కడ ఎంఐఎం అభ్యర్థులను పోటీకి దిగుతున్నారు.. బీజేపీతో పోరాడుతున్నందుకు నాపై కేసులు పెట్టారు.. అంతేకాకుండా.. లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారు.. నాకు సొంత ఇల్లు లేకుండా చేశారు.నాకు ఇల్లు లేకుండా చేయగలిగారేమో కానీ.. కోట్లాది భారతీయుల హృదయాల నుంచి బయటకు పంపలేరు.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ప్రజా తెలంగాణ ఏర్పడటం ఖాయం.


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ మీ నుంచి దోచుకున్న ప్రజల డబ్బును సంక్షేమం రూపంలో మీకు అందజేస్తాం.. ఈ సారి జరగబోయే ఎన్నికల్లో తెలంగాణలో దొరలపాలనను సాగనంపి.. ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందా మని రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజలతో నాకున్న మీతో నాకున్న అనుబంధం రాజకీయ అనుబంధం కాదు.. కుటుంబ అనుబంధం.. నెహ్రూ, ఇందిరమ్మ నాటి నుంచి ఈ బంధం కొనసాగుతోంది.


Also Read: Minister KTR: కేసీఆర్‌ను తెలంగాణలోనే ఖతం చేయాలనే కుట్ర.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..