TS Group 2 Exam Postponed: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రూప్‌-2 పరీక్షను(Group 2 Exam) వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) ప్రకటించింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. నవంబరు 2,3 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ కష్టమని భావించిన టీఎస్‌పీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించింది. ఈ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 783 గ్రూప్‌-2 పోస్టులకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జనవరి 18 నుంచి దరఖాస్తులను స్వీకరించింది. దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ముందుగా టీఎస్‌పీఎస్సీ ఆగస్టు 29, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని భావించింది. ఆ తర్వాత నవంబర్‌ 2, 3 తేదీలకు వాయిదా వేసింది. అయితే పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఓ వైపు ఎన్నికలకు, మరో వైపు పరీక్షలకు సిబ్బందిని కేటాయించడం ఇబ్బంది అవుతుందని భావించిన టీఎస్‌పీఎస్సీ చివరకు వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్‌ 30న జరగనుంది. 


నవంబర్ 3న తెలంగాణ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణ నవంబర్ 10 వరకూ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 వరకూ గడువుంటుంది. నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. తెలంగాణలో మొత్తం 3.17 కోట్లమంది ఓటర్లు ఉన్నారు.


Also Read: Revanth Reddy: అభ్యర్థుల ప్రకటనపై రేవంత్ రెడ్డి రియాక్షన్ ఇదే.. వారికి వార్నింగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook