Assembly LIVE: తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు రెండో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. ఉద‌యం 10 గంట‌ల‌కు స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శాస‌న‌స‌భ‌ను ప్రారంభించారు. ప్ర‌శ్నోత్త‌రాల‌ను ర‌ద్దు చేసి నేరుగా బ‌డ్జెట్‌పై చ‌ర్చ చేప‌ట్టారు. రాజకీయాలంటే తమకు పవిత్రమైన కర్తవ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు.
14 ఏళ్ల సుదీర్ఘ ఘర్షణ తర్వాత తెలంగాణ సాకారమైందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమన్నారు. తెలంగాణ దశాబ్దాల తరబడి అంతులేని అన్యాయానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజలు క్షోభ, బాధ అనుభవించారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు చూశామన్నారు. నిరాశలో యువత తుపాకులు పట్టి ఉద్యమం నడిపించారని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా చెప్పారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమస్యలను పరిష్కరించడం లేదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఆరోపించారు. విద్యుత్‌ ఉద్యోగుల సమస్య సుప్రీంకోర్టుకు వెళ్లిందన్నారు. నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారని విమర్శించారు. తెలంగాణ ఆస్తుల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎస్‌ సహా 14 మంది ఐఏఎస్‌ల విషయంలో వివాదాలు చేస్తున్నారన్నారు. స్వరాష్ట్ర పాలనలో అద్భుతంగా పంటలు పండుతున్నాయని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు నీళ్ల వాటా కోసం ఇప్పటికీ పోరాడుతున్నామన్నారు. రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించుకున్నాం. రాష్ట్రంలో పంటలను కొనలేమని కేంద్రమే చేతులెత్తేసిందని చెప్పారు.



Also Read: AB De Villiers: మనసు మార్చుకున్న ఏబీ డివిలియర్స్, ఆర్సీబీతో మరోసారి ఒప్పందమా


Also Read: Todays Gold Rate: బంగారం ధర ఆకాశానికి..తులం బంగారం 55 వేలకు చేరువలో


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook