Telangana Assembly: కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, ఫసల్ బీమా వట్టి బోగస్
Telangana assembly session KCR Fires On Central Government : సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పంట నష్టంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందన్నారు. గోదావరి ఉధృతి వల్లే పంటలు మునిగాయని తెలిపారు. అయితే పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపినా నిధులు ఇవ్వలేదని తప్పుబట్టారు.
Telangana assembly session CM KCR Fires On Central Government comments on Pradhan Mantri Fasal Bima Yojana Crop Insurance: దేశంలో ఫసల్ బీమా యోజన (Fasal Bima Yojana) సక్రమంగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఫసల్ బీమా లేదా మరొకటి ఏదైనా అంతా బోగసే అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana assembly session) ఏడో రోజు కొనసాగుతున్నాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (pocharam srinivas reddy) సభను ప్రారంభించారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పంట నష్టంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందన్నారు. గోదావరి (Godavari) ఉధృతి వల్లే పంటలు మునిగాయని తెలిపారు. అయితే పంట నష్టంపై కేంద్రానికి నివేదిక పంపినా నిధులు ఇవ్వలేదని తప్పుబట్టారు. కేంద్రం ఆలస్యం చేయడం వల్లే ఇబ్బందులు తలెత్తాయన్నారు. దేశంలో పంటల బీమా విధాన శాస్త్రీయంగా లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులుపడుతున్నారన్నారు.
Also Read : Railway Recruitment:రైల్వే శాఖలో 904 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..అప్లై చేయం
కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమాపై (Fasal Bima) సరిగ్గా లేదన్నారు. ఫసల్ బీమా కానీ, మన్ను బీమా కానీ, ఏదన్నా కానీ అదంతా వట్టి బోగస్ అని ధ్వజమెత్తారు. మినాథన్, అశోక్ గులాటి లాంటి వారు వ్యవసాయ రంగంలో మార్పులపై కేంద్రానికి రెకమెండ్ చేశారని.. వారి నివేదికలను కేంద్రం పట్టించుకోలేదన్నారు. రైతులు అప్పుల కోసం వెళ్తే ప్రీమియం (premium) కట్టించుకుంటున్నారు. దేశంలో ఫసల్ బీమా యోజనతో రైతులకు లాభం చేకూరట్లేదని తప్పుబట్టారు కేసీఆర్. కేంద్రాన్ని తాము విమర్శించడం.. వారు తమని విమర్శించడం సరికాదని కేసీఆర్ అన్నారు. కేంద్రానికి కొన్ని బాధ్యతలు ఉంటాయని.. ఆహార ధాన్యాల కొరత రాకుండా శీతల గోదాములు నిర్మించాలని తెలిపారు. శీతల గోదాములు (cold storage) నిర్మించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంటుందని చెప్పారు. వరి ధాన్యం తాము కొనుగోలు చేయబోమని కేంద్రం చెబుతోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇక కౌలు రైతులను పట్టించుకుంటే అసలు రైతులకే (farmers) మోసం వస్తుంది అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో భూముల విలువ పెరిగిపోతోందని.. ఈ క్రమంలోనే పారదర్శకత కోసం ధరణి పోర్టల్ తీసుకొచ్చామన్నారు. ధరణి పోర్టల్ (dharani portal) ద్వారా రైతులకు చాలా ఉపశమనం వచ్చిందన్నారు. కౌలు అనేది ప్రయివేటు వ్యవహారమని.. ఇది ఆ రైతుకు, కౌలు రైతుకు మధ్య ఉన్న ఒప్పందం అని స్పష్టం చేశారు. కౌలుదారు మారినప్పుడల్లా ప్రభుత్వాలు రికార్డులను మార్చాలంటే కుదరదన్నారు. కౌలు రైతుల విషయాన్ని తాము పట్టించుకోము అని తేల్చి చెప్పారు కేసీఆర్. ఒక వేళ కౌలు రైతులు నష్టపోతే.. అప్పుడు మానవీయ కోణంలో మాత్రమే ఆదుకుంటామని సీఎం కేసీఆర్ (KCR) చెప్పారు.
Also Read : Huzurabad bypolls nominations: హుజూరాబాద్ ఉప ఎన్నిక నామినేషన్స్‌కు నేడే చివరి తేదీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook