Bandi Sanjay: ఈనెల 12 నుంచి 22 వరకు 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనున్నారు. ఈసారి మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోనే యాత్ర సాగనుంది. గణేష్‌, విజయదశమి ఉత్సవాలతో ప్రజా సంగ్రామ యాత్రను 10 రోజులకే పరిమితం చేశారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర వెళ్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈనెల 12న కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని చిట్టారమ్మ ఆలయం వద్ద నాలుగో దశ యాత్రకు బండి సంజయ్ శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత రాంలీలా మైదానంలో భారీ బహిరంగసభ జరగనుంది. సభలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సన్ పాల్గొననున్నారు. అక్కడి నుంచి కూకట్‌పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పెద్ద అంబర్‌ పేట ఔటర్‌రింగు రోడ్డు వరకు సాగుతుంది.


ముగింపు సభలో పార్టీ పెద్దలు పాల్గొననున్నారు. 4వ దశ పాదయాత్రపై త్వరలో రూట్ మ్యాప్ రానుంది. ఇప్పటివరకు 40 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ప్రజాసంగ్రామ యాత్ర సాగింది. 4వ దశతో కలిపి 48 నియోజకవర్గాల్లో పాదయాత్ర ఉండనుంది. గ్రేటర్ సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా బండి సంజయ్ పాదయాత్ర ఉండనుంది. డబుల్ బెడ్‌రూం, రాజీవ్ స్వగృహ ఇళ్లు, స్థానిక సమస్యలు, కాలుష్యం, రోడ్లు, డ్రైనేజీ, ఫ్లైఓవర్లు, చెరువుల కబ్జా వంటి సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. 


నీటి సమస్య, విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్‌పై వ్యాట్ తగ్గింపు వంటి అంశాలపైనా పాదయాత్రలో చర్చిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ, ఆస్పత్రుల్లో ఫీజుల మోత వంటి అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పాదయాత్రను సక్సెస్ చేస్తామంటున్నారు కమలనాథులు. పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని..ఐనా సక్సెస్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. 


బండి సంజయ్‌ యాత్రను ఎవరూ అడ్డుకోలేరని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ విషయం దేవరుప్పలలోనే తెలిసిపోయిందన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చినా ..ఇవ్వకపోయినా..పాదయాత్ర కొనసాగిస్తామన్నారు బీజేపీ నేతలు. అనుమతి ఇవ్వకపోతే న్యాయ పోరాటం చేస్తామని వెల్లడిస్తున్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా పాదయాత్ర కొనసాగిస్తామంటున్నారు.


Also read:Munugode: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు చిచ్చు..రేవంత్‌రెడ్డికి అధిష్టానం షాక్..!


Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయు'గండం'..రాగల మూడురోజులపాటు వానలే వానలు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి