Munugode: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు చిచ్చు..రేవంత్‌రెడ్డికి అధిష్టానం షాక్..!

Munugode: కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను పక్కన పెడుతోందా..? మునుగోడు పార్టీ అభ్యర్థి విషయంలో ఎవరి పంతం నెగ్గింది. చల్లమల్ల కృష్ణారెడ్డికి కాకుండా పాల్వాయి స్రవంతికి ఇవ్వడానికి గల కారణాలేంటి..? తాజాగా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక కథనం..

Written by - Alla Swamy | Last Updated : Sep 10, 2022, 03:25 PM IST
  • తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు చిచ్చు
  • చల్లమల్లకి కాకుండా పాల్వాయి స్రవంతికి టికెట్
  • రేవంత్‌రెడ్డికి చెక్‌ పెట్టేందుకేనంటూ ప్రచారం
Munugode: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు చిచ్చు..రేవంత్‌రెడ్డికి అధిష్టానం షాక్..!

Munugode: తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఉప ఎన్నిక అంశం చిచ్చురేపినట్లు కనిపిస్తోంది. మునుగోడు అభ్యర్థి ఎంపిక విషయంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన ప్రతిపాదించిన పేరును కాకుండా మరో అభ్యర్థిని అధికారికంగా ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి మునుగోడులో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
తానే అభ్యర్థినంటూ బహిరంగంగానే చెప్పుకున్నారు.

మునుగోడు నియోజకవర్గంలో పార్టీ కోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చల్లమల్లకే టికెట్‌ దక్కుతుందని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ హామీతోనే మునుగోడులో అంతా తానై నడిపించాడని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఐతే తీరా పార్టీ అధిష్టానం రేవంత్‌రెడ్డికి, చల్లమల్ల కృష్ణారెడ్డికి షాక్‌ను ఇచ్చింది. అనుహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చింది. 

దీంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వర్గం ఖంగుతింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వర్గానికి చెందిన స్రవంతికి మునుగోడు టికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. గతకొంతకాలంగా కాంగ్రెస్‌లో రేవంత్, వెంకట్‌రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తనకు కాకుండా బయటి నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ ఇవ్వడంతో కోమటిరెడ్డి వర్గం అసంతృప్తిగా ఉంది. ఈనేపథ్యంలోనే ఆయన పార్టీ పెద్దలను లేఖలు అందజేశారు.

ఆ తర్వాత కాంగ్రెస్‌లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు అడ్డుకట్ట వేసేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఈనిర్ణయం తీసుకుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి, ఆ పార్టీ నేత చల్లమల్ల కృష్ణారెడ్డి..రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఎలాంటి విభేదాలు లేకుండా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

త్వరలో కాంగ్రెస్‌ పార్టీ మునుగోడులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్‌ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈనేపథ్యంలో పార్టీ పెద్దలతో పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. త్వరలో ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ రానున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు కలిసి వస్తుందో లేదో వేచి చూడాలి..

Also read:తెలుగు రాష్ట్రాల రికార్డులు బద్దలు.. ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

Also read:Virat Kohli: ఎప్పటికీ కోహ్లీ గర్జించే సింహమే..చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తికర ట్వీట్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News