Munugode Bypoll: మునుగోడు పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి మునుగోడుకు వెళ్తున్న బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గంలోకి స్థానికేతురులకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ను అబ్ధుల్లాపూర్‌మెట్ వద్ద అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భారీ భద్రత నడుమ ఆయనను బీజేపీ కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. ఆయనను అక్కడే నిర్బంధించినట్లు సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మునుగోడులో ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల అక్కడే ఉన్నారని.. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని బండి సంజయో గురువారం అర్ధరాత్రి మునుగోడుకు బయలుదేరారు. స్థానికేతురులకు అనుమతి లేదని మలక్‌పేట వద్దే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో.. బండి సంజయ్ కారును మాత్రమే అనుమతించారు. వనస్థలిపురం వద్ద మరోసారి పోలీసులు అడ్డుకోగా.. అక్కడ కూడా కార్యకర్తల సాయంతో ఆయన వెళ్లిపోయారు.


అబ్దుల్లాపూర్‌మెట్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ హైటెన్షన్‌ నెలకొంది. మునుగోడుకు వెళ్లేందుకు వీళ్లేదని బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. ఓవైపు మునుగోడులో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. 


'ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంత్రులు, స్థానికేతర ఎమ్మెల్యేలు, అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మునుగోడులోనే ఉండి ప్రజలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని పదే పదే హెచ్చరించినా పట్టించుకోని పోలీస్ యంత్రాంగం.. ఎన్నికల నియమావళికి లోబడి నిరసన తెలుపుదామని బయలుదేరిన మమ్మల్ని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద బలవంతంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను..' అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. 


మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌పై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మునుగోడులో స్థానికేతురులైన టీఆర్ఎస్ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 


Also Read: Munugodu Polling: మునుగోడు పోలింగ్‌కు సర్వం సిద్ధం, ఓటర్లు ఎంతమంది, పోలింగ్ సిబ్బంది


Also Read: Chintakayala Ayyanna Patrudu: నర్సీపట్నంలో అర్ధరాత్రి హైడ్రామా.. మాజీ అయ్యన్న పాత్రుడు అరెస్ట్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook