Bandi Sanjay: బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులు, అక్రమ కేసుల నమోదుకు నిరసనగా కరీంనగర్ లోని తన నివాసంలో దీక్ష చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పలువురు బీజేపీ నేతలు ఆయన దీక్షుకు మద్దతు తెలిపారు. దీక్ష సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. టీఆర్ఎస్ సర్కార్, కేసీఆర్ ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  లిక్కర్‌ స్కామ్‌ లో కేసీఆర్‌ కుటుంబంపై వస్తున్న ఆరోపణల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తనను టీఆర్ఎస్ సర్కార్ అరెస్టు చేసిందని ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, అడ్డంకులు స్పష్టించినా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగించి తీరుతానని చెప్పారు. కుటుంబ పాలన ఎంత ప్రమాదమో కేసీఆర్ కుటుంబాన్ని చూస్తే అర్థమవుతుందన్నారు బండి సంజయ్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇసుక బుక్కేది వాళ్ళే.. లిక్కర్ దందాలో వాళ్ళే ,,డ్రగ్స్ భూ మాఫియా ఏదైనా వాళ్ళేననని బండి సంజయ్ అన్నారు.  ఎక్కడ ఐటీ దాడులు జరిగినా కల్వకుంట కుటుంబం మూలాల వాటాలు తేలుతున్నాయన్నారు. 1400 మంది ఆత్మ బలిదానాల మంటల్లో సీఎం కేసీఆర్ చలి కాల్చుకుంటున్నారని సంజయ్ మండిపడ్డారు. లిక్కర్ ఆరోపణలు డైవర్ట్ చేసేందుకు హైదరాబాద్ లో మత విద్వేషాలు, మత ఘర్షణలకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే ప్లాన్ జరిగిందని ఆరోపించారు. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర చేస్తున్నారని..ఇది ముమ్మాటికీ నిజం అన్నారు బండి సంజయ్. తన  కుటుంబం జోలికి వస్తె పరిస్తితి ఇలా ఉంటుందని వార్నింగ్ వచ్చేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు.


కేసీఆర్ తాత జేజమ్మ లు వచ్చినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు బండి సంజయ్. రాడ్లతో వచ్చినా రాళ్లతో వచ్చినా సరే యాత్ర చేసి తీరుతానని చెప్పారు. ఈనెల 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ జరిపి తీరుతామని చెప్పారు,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో సభ జరుగి తీరుతుందని.. ఎవరూ ఆపుతారో చూస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. లిక్కర్ మాఫియాలో బిడ్డ పాత్ర బయటకు రావద్దనే ప్రజా సంగ్రామ యాత్రను ఆపాలని చూస్తున్నారని ఆదిలాబాద్ ఎంపీ ఎంపీ సోయం బాబురావు కామెంట్స్ చేశారు. టిఆర్ఎస్ గూండాలను పంపి ప్రజా సంగ్రామయాత్రపై దాడి చేశారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ భయపడుతున్నారని అన్నారు. కోర్టు నుంచి అనుమతి తీసుకొని ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తామని చెప్పారు.


Read Also: Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక జరగదా.. కేసీఆర్ వ్యూహమేంటీ? బీజేపీ నేత ఎందుకలా అన్నారు? 


Read Also: ADANI NDTV DEAL: మీడియా కాదు మోడియా... ఎన్డీటీవీ అదానీ డీల్ పై కేటీఆర్ సెటైర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి