Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక జరగదా.. కేసీఆర్ వ్యూహమేంటీ? బీజేపీ నేత ఎందుకలా అన్నారు?

Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే బైపోల్ ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అయినా ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో సాగుతోంది. పార్టీల హడావుడి చూస్తే ఉప ఎన్నిక వచ్చిందనే భావన కన్పిస్తోంది

Written by - Srisailam | Last Updated : Aug 24, 2022, 12:43 PM IST
  • మునుగోడు ఉప ఎన్నిక జరగదా!
  • బీజేపీ సీనియర్ నేత ట్విస్ట్
  • కేసీఆర్ ముందస్తుకు వెళతారని కామెంట్
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక జరగదా.. కేసీఆర్ వ్యూహమేంటీ? బీజేపీ నేత ఎందుకలా అన్నారు?

Munugode Bypoll: తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం చుట్టే తిరుగుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడుకు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే బైపోల్ ఎప్పుడు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. అయినా ప్రచారం మాత్రం ఓ రేంజ్ లో సాగుతోంది. పార్టీల హడావుడి చూస్తే ఉప ఎన్నిక వచ్చిందనే భావన కన్పిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మునుగోడు అసెంబ్లీకి ఫిబ్రవరి రెండో వారం వరకు బైపోల్ జరిపేందుకు గడువుంది. కాని పార్టీలు మాత్రం అప్పుడే జోరుగా జనంలోకి వెళుతున్నాయి. సీఎం కేసీఆర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించారు. దీంతో మునుగోడు ఉప ఎన్నికను వీలైనంత త్వరగా జరిపే యోచనలో బీజేపీ ఉందనే టాక్ నడుస్తోంది. అందుకే మునుగోడులో అమిత్ షా సభ నిర్వహించారని.. బీజేపీ ప్లాన్ పసిగట్టిన కేసీఆర్.. వాళ్లకంటే ముందు సభ నిర్వహించారని అంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో మరో ప్రచారం కూడా సాగుతోంది. ఉప ఎన్నిక వస్తుందా రాదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా మునుగోడు ఉప ఎన్నిక, కేసీఆర్ వ్యూహాలకు సంబంధించి తాజాగా బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ  సీనియర్ నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి.. మునుగోడుకు ఉప ఎన్నిక రాకుండా కేసీఆర్ ఎత్తులు వేస్తున్నారంటూ సంచలన కామెంట్లు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారని.. అందుకే పెండింగ్  ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని నల్లు అన్నారు. జిల్లా కలెక్టరేట్లను వరుసగా ప్రారంభిస్తున్నారు కేసీఆర్. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే జిల్లాలు పర్యటిస్తూ.. కలెక్టరేట్లు ప్రారంభిస్తూ కేసీఆర్ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇటీవలే వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభించారు. ఈనెల 25న రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించనున్నారు. తర్వాత వరుసగా పలు జిల్లాలు పర్యటించనున్నారు కేసీఆర్. సీఎం టూర్లకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చేసింది. ముందస్తుకు వెళ్లాలని డిసైడ్ కావడం వల్లే కేసీఆర్ జనాల్లోకి వస్తున్నారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లోనూ వినిపిస్తోంది.

ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని కొన్ని నెలలుగా  చర్చ సాగుతోంది. మునుగోడు ఉప ఎన్నికలో తేడా వస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుంది కాబట్టి.. ఆ రిస్క్ లేకుండా మునుగోడు ఉపఎన్నిక జరగడానికి ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాయనే యోచనలో కేసీఆర్ ఉన్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అక్టోబర్, నవంబర్ లో అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేయబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. వచ్చే మార్చిలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా కేసీఆర్ స్కెచ్ వేశారని అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికలో తేడా కొడితే మొదటికే మోసం వస్తుందని భయపడుతున్న కేసీఆర్.. మునుగోడు ఉప ఎన్నిక జరగకుండా.. డైరెక్టుగా ముందస్తు ఎన్నికలకే వెళ్లాలనే యోచనలో ఉన్నారని.. దీనిపై పార్టీ ముఖ్య నేతలతో జోరుగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. కేసీఆర్ జిల్లా పర్యటనలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. అటు మునుగోడులోనూ టీఆర్ఎస్ దూకుడు తగ్గింది. ఈ పరిణామాలు ముందస్తు సంకేతాలు ఇస్తుండగా.. తాజాగా బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి చేసిన ప్రకటన మరింత చర్చకు దారి తీస్తోంది.

మునుగోడు ఉప ఎన్నిక, ముందస్తు ఎన్నికలకు సంబంధించి మరో ప్రచారం కూడా సాగుతోంది. నిజానికి గత రెండు వారాల క్రితం వరకు నిర్వహించిన కేసీఆర్ సర్వేలో మునుగోడులో టీఆర్ఎస్ కే పూర్తి ఎడ్జ్ ఉందని తేలిందట. ఉప ఎన్నిక వస్తే తమకు ఢోకా లేదని గులాబీ బాస్ భావించారట. అందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ నిమిషాల్లోనే ఆమోదించారని అంటున్నారు. అయితే ఇప్పుడు మాత్రం మునుగోడులో సీన్ మారిందని అంటున్నారు. రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వివిధ పార్టీల నుంచి నేతలు భారీగా బీజేపీలో చేరారు. ఇంకా చేరుతూనే ఉన్నారు. అటు అధికార పార్టీలో మాత్రం అసమ్మతి తీవ్రంగా ఉంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్ భావించినా.. క్షేత్రస్థాయిలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని. మునుగోడు సభకు ముందు నిర్వహించిన తాజా సర్వేలో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందని తేలిందట. అందుకే బహిరంగ సభలో అభ్యర్థి పేరును కేసీఆర్ ప్రకటించలేదని తెలుస్తోంది. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే పార్టీకి నష్టమన్న నివేదికలు రావడం.. కోమటిరెడ్డికి రోజురోజుకు గ్రాఫ్ పెరుగుతుండటంతో ఉప ఎన్నిక విషయంలో కేసీఆర్ ప్లాన్ మార్చారని అంటున్నారు.

మునుగోడుకు ఉప ఎన్నిక రాదన్న ప్రచారంతో నియోజకవర్గ ఓటర్లు మాత్రం డీలా పడుతున్నారని అంటున్నారు. కోమటిరెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచే మునుగోడు ఓటర్లు ఎన్నో అశలతో ఉన్నారు. హుుజురాబాద్ తరహాలో తమ పంట పండుతుందని అనుకుంటున్నారు. ఓటుకు 10 నుంచి 15 వేల వరకు ఇవ్వడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ సీనియర్ నేత చేసిన కామెంట్లు మునుగోడు ఓటర్లను అయోమయంలో పడేస్తున్నాయి.

Read also: AP, TS POLICE FIGHT: ఏడేళ్ల క్రితం సీన్ రిపీట్.. నాగార్జున సాగర్ లో ఏపీ, తెలంగాణ పోలీసుల ఫైటింగ్

Read also:  ADANI NDTV DEAL: మీడియా కాదు మోడియా... ఎన్డీటీవీ అదానీ డీల్ పై కేటీఆర్ సెటైర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News