Bandi Sanjay On MLC Kavitha: మహిళా బిల్లు విషయంలో కేసీఆర్ బిడ్డ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తానని చెప్పడం చూస్తే నవ్వొస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘‘జంతర్ మంతర్ దగ్గర తరువాత ధర్నా చేయ్.. ముందు మీ అయ్యను నిలదీయ్. మీ పార్టీలో ఎంత మంది మహిళలకు చోటు ఇచ్చారో చెప్పమను. మీ ప్రభుత్వంలో మహిళలెంత మంది ఉన్నారు..? మహిళలంటే ఎందుకంత కక్ష..? పోయిన కేబినెట్‌లో మహిళలకు ఎందుకు చోటివ్వలేదు. మహిళా గవర్నర్‌ను ఎందుకు అవమానిస్తున్నవ్..? మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేస్తే ఎందుకు స్పందించవ్..? పార్లమెంట్‌లో మహిళా బిల్లును ప్రవేశపెడితే ఆ కాపీలను చించిపారేసిన పార్టీలతో ఎందుకు దోస్తానా చేస్తున్నవో నిలదీయ్..’’ అని అన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరీంనగర్, జగిత్యాల జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు హాజరైన బండి సంజయ్ మధ్యాహ్నం జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్, బీజేపీ నేత బోగ శ్రావణి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, శ్రావణిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన సంస్థను ఏర్పాటు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రూ.400 కోట్లను కేటాయించడం సంతోషమన్నారు. జంతర్ మంతర్ వద్ద  కేసీఆర్ బిడ్డ ధర్నా చేస్తానంటే మహిళలు నవ్వుకుంటున్నారని అన్నారు.  


నేషనల్ క్రైమ్ బ్యూర్ రికార్డ్స్ ప్రకారం తెలంగాణలో నేరాల సంఖ్య 17 శాతం పెరిగిందని.. హత్యలు, అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్ తెలంగాణగా మారిందన్నారు బండి సంజయ్. హత్యలు, అత్యాచారాలు చేసేటోళ్లలో ఎక్కువ మంది బీఆర్ఎసోళ్లేనని.. ఎవరైనా ఇతరులు అత్యాచారాలు చేసి బీఆర్ఎస్‌లో చేరితే వాళ్ల కేసులు మాఫీ చేస్తున్నారని ఆరోపించారు. 
బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వాళ్లకు చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. యూపీ తరహాలో వాళ్ల ఇళ్లు కూల్చేస్తామన్నారు.


'గ్యాస్ ధరల పెంపుపై బీఆర్ఎస్ నేతలు ధర్నాలు చేయడం సిగ్గు చేటు. బీఆర్ఎస్‌కు సిగ్గుండాలి. పెట్రోలు, డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎట్లున్నయ్.. తెలంగాణ కంటే 15 రూపాయలు తక్కువ ఎందుకున్నయ్..? కరెంట్ ఛార్జీలు 10 సార్లు పెంచారు. 7 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. నల్లా ఛార్జీలు, రిజిస్ట్రేషన్లు పెంచి జనాన్ని బాదుతున్నారు. వీటిపై మీరెందుకు ధర్నా చేయలేదు..? బీజేపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా  ఆ మేరకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తాం.. గ్యాస్ ధరలు  పెరిగినందుకు మేం కూడా బాధపడుతున్నాం. కానీ రష్యా–ఉక్రెయిన్ యుద్దం వల్ల చమురు కొరత ఏర్పడటంతో ధరలు పెరిగాయనే విషయం ప్రజలకు తెలుసు..' అని అన్నారు. 


Also read: GIS 2023 Updates: ఏపీలో విద్యుత్ రంగంలో అదానీ, అంబానీల భారీ పెట్టుబడులు


Also read: Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. భారీగా ఉద్యోగావకాశాలు: సీఎం జగన్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook