ఇవాళ, రేపు రెండ్రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు దేశంలోని అతిరధ మహారధులు తరలివచ్చారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెడుతున్న పెట్టుబడుల్ని వివరించారు. ముఖ్యంగా అదానీ, అంబానీలు త్వరలో రాష్ట్రంలో పెట్టనున్న పెట్టుబడులు కీలకంగా మారాయి.
ముకేశ్ అంబానీ మాటల్లో..
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అడ్వాంటేజ్ ఏపీలో నిజంగానే అద్భుతమైన టాలెంట్, మానవ వనరులు చాలా ఉన్నాయి. గోదావరి-కృష్ణ నదీతీరం, విజయనగర సామ్రాజ్య వైభవం అన్నీ ఏపీకు సొంతం.
త్వరలో ఏపీలో రెన్యూవబుల్ సోలార్ ఎనర్జీ రంగంలో 10 గిగావాట్స్ సామర్ధ్యం కలిగిన పరిశ్రమను నెలకొల్పుతాం. అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకూ పెట్టినట్టే ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు కొనసాగుతాయి.
ఏపీలో మౌళిక సదుపాయాలు, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఏపీ నుంచి అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు చాలామంది ఉన్నారు. రిలయన్స్‌లో కీలకమైన అధికారులు కూడా ఏపీ నుంచే ఉన్నారు. భారతదేశానికి ఏపీ చాలా కీలకంగా ఉంది.
ఏపీ సుదీర్ఘమైన కోస్తాతీరం కలిగి ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా నెంబర్‌వన్ స్థానంలో ఉన్నందుకు ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతున్నాను. కీలకమైన రంగాల్లో ఏపీలో వనరులు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే ఏపీ కేజీ బేసిన్‌లో 150 వేల కోట్ల పెట్టుబడులు రిలయన్స్‌వి కొనసాగుతున్నాయి. ఏపీలో జియో నెట్‌వర్క్ అభివృద్ధి శరవేగంగా ఉంది. రిలయన్స్ రిటైల్ ద్వారా రాష్ట్రంలోని 6 వేల గ్రామాలతో అనుసంధానం కలిగి ఉన్నాం.
కరణ్ అదానీ మాటల్లో..
అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఏపీలో ఇప్పటికే కృష్ణపట్నం, గంగవరం పోర్టులు నడుస్తున్నాయి. రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు భవిష్యత్తులో ఇంకా పెరగనున్నాయి. ఏపీలో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నందుకు ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. వీటికితోడు రాష్ట్రంలో త్వరలో 15 వేల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నెలకొల్పనున్నాం.
Also read: GIS 2023 Menu: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ అతిథులకు నోరూరించే వంటకాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook