Munugodu ByElection: మునుగోడుకు ఉపఎన్నిక ఖాయం.. యాదాద్రి సభలో బీజేపీ నేతల సంకేతం.. ఆ రోజునే కోమటిరెడ్డి రాజీనామా?
Munugodu ByElection: తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందనే చర్చ జరుగుతోంది.
Munugodu ByElection: తెలంగాణ రాజకీయాలు కొన్ని రోజులుగా ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తారని.. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందనే చర్చ జరుగుతోంది. అయితే పార్టీ మార్పుపై క్లారిటీ ఇస్తున్న కోమటిరెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. నియోజకవర్గంలోని తన అనుచరులతో సమావేశాలు జరుపుతున్నారు. అయితే ఉపఎన్నికలో గెలుపు కష్టమని అనుచరులు చెప్పడంతో ఎమ్మెల్యే పదివికి రాజీనామాపై రాజగోపాల్ రెడ్డి వెనుకాడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక, ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై రోజుల తరబడి సస్పెన్స్ కొనసాగుతుండగా.. తాజాగా కమలం నేతలు స్పష్టత ఇచ్చారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాదాద్రి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా యాదాద్రిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన బీజేపీ ముఖ్య నేతలు ఉపన్నిక వస్తుందనే సంకేతం ఇచ్చారు. బీజేపీ చేరికల కమిటి కన్వీనర్ గా ఉన్న ఈటల రాజేందర్ మునుగోడులో ఉప ఎన్నిక వస్తుందని చెప్పడం ఆసక్తిగా మారింది. హుజురాబాద్ ఓటర్లు కేసీఆర్ ను గుద్దు గుద్దితే ఎక్కడో పడ్డారని చెప్పిన ఈటల.. ఆ భాగ్యం హుజురాబాద్ కి దక్కిందన్నారు. అలాంటి భాగ్యం మళ్లీ నల్గొండ కు దక్కపోతుందని చెప్పారు. మునుగోడుకు ఉప ఎన్నిక రాబోతుందని చెప్పకనే చెప్పారు ఈటల రాజేందర్. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పింది కేసీఆర్ అయితే.. అదే దళిత బిడ్డను రాష్ట్రపతి ని చేసిన ఘనత మోడీకి దక్కిందన్నారు.
రాష్ట్రంలో బీజేపీ నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు ఈటల రాజేందర్. ఒక ముఖ్య నేత తాము బీజేపీ వైపు చూస్తున్నామని ఫోన్ చేశారని చెప్పారు. తన ఫోన్ పోలీస్ టాప్ అవుతుందని చెబితే వినాలనే చెబుతున్నానని ఆ నేత తనతో అన్నారన్నారు.8 ఏండ్ల కాలంలో ప్రజలకు బాధ వేస్తే ప్రగతిభవన్ లో సెక్రటరియేట్ లో కలిసే అవకాశం ఉందా అని నిలదీశారు. ఫారెస్ట్ అధికారుల కాళ్ళ మీద గిరిజన బిడ్డలు పడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ దుస్థితికి కారణమైన కేసీఆర్ కు కర్రు కాల్చి వాత పెట్టె సమయం వచ్చిందన్నారు. ఈటల రాజేందర్ తాజా వ్యాఖ్యలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఖాయమని తెలుస్తోంది. ఇందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయిందని.. మరో వారం రోజుల్లోనే ఉండే అవకాశం ఉందంటున్నారు. ఆగస్టు 7న రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
మరోవైపు మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటించారు. ఐదు దొనల తండా, కడిలా బాయి తండా, తుంబాయ్ తండాలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. రాచకొండ రైతుల పోడు భూముల సమస్యను గిరిజనులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివరించారు. అవసరమైతే ఈ సమస్య పరిష్కారం కోసం తన పదవి రాజీనామా చేయడానికైనా సిద్ధం అంటూ ప్రజలకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి.
Read also: శ్రీమతి శ్రీనివాస్ తెలుగు సీరియల్ నటుడిపై దాడి.. ఆ మాట చెబుతున్నా వినకుండా!
Read also: Sweeper to Manager: ఒకప్పుడు బ్యాంకులో స్వీపర్.. ఇప్పుడు మేనేజర్! ఈ మహిళ సక్సెస్ స్టోరీ ఇదే
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook